Ballriలో వడగళ్లతో కూడిన భారీ వర్షం

ABN , First Publish Date - 2022-06-03T17:34:52+05:30 IST

బళ్లారి జిల్లాలో గురువారం సాయంత్రం వడగండ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. బలమైన ఈదురుగాలులకు చెట్లు, విద్యుత్‌ స్తంభాలు

Ballriలో వడగళ్లతో కూడిన భారీ వర్షం

                          - ఈదురుగాలులకు నేలకొరిగిన చెట్లు, విద్యుత్‌ స్తంభాలు 


బళ్లారి(బెంగళూరు), జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): బళ్లారి జిల్లాలో గురువారం సాయంత్రం వడగండ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. బలమైన ఈదురుగాలులకు చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. పలు చోట్ల వడగండ్ల వర్షం కురిసింది. సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైన వర్షం రాత్రంతా కురిసింది. డ్రైనేజీల్లో నీరు ప్రవహించలేక రోడ్ల మీద నిండిపోయాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. విద్యుత్‌ స్తంభాలు కూలి పోవడంతో విద్యుత్‌ సరఫరా ఆగిపోయి రాత్రంతా బళ్లారి నగరం చీకట్లో నిండిపోయింది. ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షానికి పలు లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. అండర్‌ టన్నెల్‌లోను, అండర్‌ గ్రౌండ్ల లోను నీరు నిలిచి రాకపోకలు స్తంభించిపోయాయి.

Updated Date - 2022-06-03T17:34:52+05:30 IST