క్యూ1 ఫలితాల ఎఫెక్ట్.. బాలకృష్ణ ఇండస్ట్రీస్ ఢమాల్..

ABN , First Publish Date - 2022-08-05T19:40:49+05:30 IST

ప్రస్తుత ఆర్థిక సంవత్సంర జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో బాలకృష్ణ ఇండస్ట్రీస్ ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో

క్యూ1 ఫలితాల ఎఫెక్ట్.. బాలకృష్ణ ఇండస్ట్రీస్ ఢమాల్..

Balkrishna Industries : ప్రస్తుత ఆర్థిక సంవత్సంర జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో బాలకృష్ణ ఇండస్ట్రీస్ ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో గత రెండు రోజులుగా కంపెనీ షేర్లు( Balkrishna Industries Shares) దారుణంగా పతనమవుతున్నాయి. శుక్రవారం ఇంట్రా డే(Intra-Day)లో 6 శాతం పడిపోయి రూ.2,190కి చేరుకున్నాయి. ముడి సరుకు ధరలు పెరగడంతో మార్జిన్ పనితీరును ప్రభావితం చేసింది. దీంతో త్రైమాసిక ఫలితాలు నిరాశాజనకంగా మారాయి.


మూడు ట్రేడింగ్ రోజుల్లో టైర్స్, రబ్బర్ ఉత్పత్తుల కంపెనీ(tyres & rubber products company) స్టాక్ 10 శాతం పడిపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఎబిటా మార్జిన్లు(Ebitda margins) 550 బేసిస్ పాయింట్లు తగ్గింది. త్రైమాసికంగా 910 బేసిస్ పాయింట్లు(Basis Points), వార్షికంగా 20.1 బేసిస్ పాయింట్లు తగ్గాయి. ప్రస్తుత త్రైమాసికంలో ముడి సరుకు ధరలు(raw material prices) అంచనాకు అనుగుణంగానే ఉన్నాయి. 


గత ఏడాది తొలి త్రైమాసికంలో ముడిసరుకు ధరలు 42.8 శాతం ఉండగా..అవి ప్రస్తుత త్రైమాసికంలో 46.6కి చేరుకున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం నుంచి ముడిసరుకు ధరలు తగ్గే అవకాశం ఉందని మేనేజ్‌మెంట్ అంచనా వేస్తోంది. రవాణా వ్యయం(logistics costs) కూడా మూడో త్రైమాసికం లేదంటే చివరి త్రైమాసికం నాటికి కాస్త తగ్గే అవకాశం ఉందని భావిస్తోంది.

Updated Date - 2022-08-05T19:40:49+05:30 IST