Balka Suman: దేశ భవిష్యత్ కోసం కేంద్రం పనిచేయడం లేదు..

ABN , First Publish Date - 2022-09-09T17:47:31+05:30 IST

దేశ భవిష్యత్ కోసం కేంద్రం పనిచేయడం లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ విమర్శించారు.

Balka Suman: దేశ భవిష్యత్ కోసం కేంద్రం పనిచేయడం లేదు..

హైదరాబాద్ (Hyderabad): దేశ భవిష్యత్ కోసం కేంద్రం పనిచేయడం లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ (Balka Suman) విమర్శించారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ మత విద్వేషాలు పెచ్చరిల్లుతున్నాయని, ప్రధాని మోదీ (PM Modi) పాలనలో ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ ప్రజలంతా నాయకుని కోసం ఎదురు చూస్తున్నారని, కేసీఆర్ (KCR) జాతీయ పార్టీ పెట్టాల్సిందేనన్నారు. దేశానికి బీజేపీ పీడ పోవాల్సిందేనని, రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు కేసీఆర్ వెంట ఉన్నారన్నారు. దేశం ప్రపంచంలో అగ్రగామిగా నిలువాలంటే కేసీఆర్ నడుం కట్టాలని, తామంతా వెంట ఉంటామన్నారు. దేశంలో రాక్షస పాలన అంతం కావాలి.. నయా పాలనకు పునాది పడాలి.. కేసీఆర్ రాక కోసం దేశ ప్రజలు ఎదురుచూస్తున్నారని బాల్క సుమన్ అన్నారు.

Updated Date - 2022-09-09T17:47:31+05:30 IST