టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడిగా బాల్క సుమన్‌

ABN , First Publish Date - 2022-01-27T05:39:58+05:30 IST

అధికార టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడిగా చెన్నూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ బాల్క సుమన్‌ నియమితులయ్యారు.

టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడిగా బాల్క సుమన్‌
మందమర్రిలో బైక్‌ ర్యాలీ నిర్వహిస్తున్న టీఆర్‌ఎస్‌ నాయకులు

- జిల్లాలో అంబరాన్నంటిన సంబరాలు

మంచిర్యాల, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): అధికార టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడిగా చెన్నూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ బాల్క సుమన్‌ నియమితులయ్యారు. ఇంతకాలం అధ్యక్ష పదవి విషయంలో నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ బుధవారం సీఎం కేసీఆర్‌ బాల్క సుమన్‌ను నియమించారు. ఇటీవలి కాలంగా టీఆర్‌ఎస్‌ సంస్థాగత నిర్మాణంపై ధృష్టిసారించగా అధిష్ఠానం సూచనల మేరకు సెప్టెంబరు 2 నుంచి 20వ తేదీ వరకు గ్రామ, పట్టణ, మండల కమిటీలను నియమించారు. జిల్లా కమిటీ నియమించాల్సి ఉన్నప్పటికీ సీఎం కేసీఆ ర్‌ ఆచితూచి అడుగులు వేశారు.  దీంతో రోజు రోజుకూ ఆశావహుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. పార్టీకి, పార్టీ శ్రేణులకు, ప్రజా ప్రతిని ధులకు అనుసంధాన కర్తగా ఉండనుండగా అధ్యక్ష పదవి కోసం అభ్యర్థిని ఖరారు చేయడంలో. మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్‌రావు, బాల్క సుమన్‌, దుర్గం చిన్నయ్యలు ఆచితూచి అడుగులు వేశారు. తన అనునాయుల పేర్లను షీల్డు కవర్లో అధిష్ఠానానికి పంపించారు. 

-పలువురి పేర్లు తెరపైకి..

తొలుత పలువురి పేర్లు తెరపెకి వచ్చినా అధిష్ఠానం మాత్రం బాల్క సుమన్‌కే పట్టం గట్టింది. సీఎం కుటుంబ సభ్యులకు అత్యంత సన్నిహితుడు కావడంతోపాటు జిల్లాలో చురుకైన, సామర్థ్యం కలిగిన ఎమ్మెల్యేగా బాల్క సుమన్‌కు పేరుంది. దీంతో ఆయన వైపే సీఎం మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. రాబోయే ఎన్నికలలో జిల్లా రాజకీ యాల్లో పెను మార్పులు జరుగనున్న తరుణంలో బాల్క సుమన్‌ నియమితులవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఆయన నియామకం పట్ల జిల్లా కేడర్‌ అంతా సంబరాలు జరుపుకుం టున్నాయి. మంచిర్యాల జిల్లా కేంద్రంతో పాటు నస్పూరు, దండేపల్లి, చెన్నూరు, మందమర్రి, భీమారం, కోటపల్లి, రామకృష్ణాపూర్‌ పట్టణంలో టీఆర్‌ఎస్‌ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భగా స్వీట్లు పంపిణీ చేశారు.  

Updated Date - 2022-01-27T05:39:58+05:30 IST