విద్యుత్ ఉద్యోగుల జేఎసీ నేతలతో మంత్రి బాలినేని చర్చలు

ABN , First Publish Date - 2022-02-16T22:24:01+05:30 IST

విద్యుత్ ఉద్యోగుల జేఎసీ నేతలతో మంత్రి బాలినేని చర్చలు

విద్యుత్ ఉద్యోగుల జేఎసీ నేతలతో మంత్రి బాలినేని చర్చలు

అమరావతి: విద్యుత్ ఉద్యోగుల జేఎసీ నేతలతో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చర్చలు జరిపారు. సచివాలయంలో తన ఛాంబర్‌లో ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రి బాలినేని భేటి అయ్యారు. ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి ఇచ్చిన  నోటీసులోని అంశాలపై చర్చిస్తున్నారు. 24 డిమాండ్లతో ప్రభుత్వానికి జనవరి  28న విద్యుత్ ఉద్యోగ సంఘాల జేఎసీ నోటీసు ఇచ్చారు. కృష్ణపట్నం థర్మల్ విద్యుత్ కేంద్రం ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ఉద్యోగుల జేఎసీ నోటీసులు అందించారు. విద్యుత్ ఉద్యోగుల వేతనాలపై ఏర్పాటు చేసిన పీఆర్సీను జేఎసీ వ్యతిరేకిస్తోంది. పీఆర్సీ బాధ్యతలను విద్యుత్ సంస్థలకు చెందిన ఉన్నతాధికారులకే ఇవ్వాలని నోటీసులో డిమాండ్ చేశారు. విద్యుత్ సంస్థల్లో పని చేస్తోన్న ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ కార్మికుల సర్వీసులను రెగ్షులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు  వారి కుటుంబాలకు అపరిమిత వైద్యం అందించాలని కూడా డిమాండ్ చేశారు. విద్యుత్ సంస్థలో కారుణ్య నియామకాలు చేపట్టాలని,  విద్యుత్ ఉద్యోగులపై వేధింపులు ఆపడం, తదితర సమస్యలపై  ఉద్యోగుల జేఎసీ నోటీసు ఇచ్చారు. నోటీసులో ఇచ్చిన డిమాండ్ల పరిష్కారంపై ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రి బాలినేని చర్చిస్తున్నారు. న్యాయం కోరితే మా జీతాలను ఆపుతారా అంటూ నిరసనలు వ్యక్తం చేశారు. నిన్న మంత్రిని విజయవాడ లోని ఆయన నివాసం వద్ద కలసిన ఏపి‌ఎస్‌పి ఈ జేఏసి నాయకులు నేడు సమావేశంలో అన్ని అంశాలను చర్చిద్దాం అని మంత్రి హమీ ఇచ్చారు. పీఆర్సీ విషయంలో తమకు ఉన్న అభ్యంతరాలను చర్చించాలని  జెన్కో భావిస్తోంది. 

Updated Date - 2022-02-16T22:24:01+05:30 IST