97 శాతం ఆహారం మొక్కల నుంచి వస్తుంది: బాలినేని

ABN , First Publish Date - 2022-03-02T18:25:23+05:30 IST

బయో డైవర్సిటీ బోర్డుకు అవసరమైన అన్ని సదుపాయాలూ సమకూర్చుతామని మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు

97 శాతం ఆహారం మొక్కల నుంచి వస్తుంది: బాలినేని

అమరావతి : బయో డైవర్సిటీ బోర్డుకు అవసరమైన అన్ని సదుపాయాలూ సమకూర్చుతామని మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డితో  బోర్డులో నియామకాల గురించి మాట్లాడుతానన్నారు. బయో డైవర్సిటీ అనేక రకాలుగా ఉపయోగపడుతుందన్నారు. మొక్కల నుంచి ఔషధాలు తయారవుతున్నాయన్నారు. 97 శాతం ఆహారం మొక్కల నుంచి వస్తుందని బాలినేని తెలిపారు.. 3 శాతం జీవుల నుంచి వస్తుందన్నారు. రాష్ట్ర బయో డైవర్సిటీ బోర్డు పలు కార్యక్రమాల కోసం 9కోట్లు విడుదల చేసిందని బాలినేని పేర్కొన్నారు. కాకినాడ, కడప, నెల్లూరు, తిరుపతితో పాటు పలు ప్రాంతాల్లో బయో డైవర్సిటీ కన్సర్వేషన్ జరుగుతోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు ప్రజలు కూడా జల చరాల మనుగడ కోసం తమవంతు కృషి చేయాలన్నారు. అరుదైన మొక్కలను, జల చరాలను కాపాడుకోవాలని బాలినేని పేర్కొన్నారు.

Updated Date - 2022-03-02T18:25:23+05:30 IST