Abn logo
Mar 2 2021 @ 23:31PM

విద్యార్థినులు ప్రలోభాలకు గురికావద్దు

 మనుబోలు, మార్చి 2: కౌమారదశలో ఉండే విద్యార్థినులు, బాలికలు వ్యామోహాలకు, ప్రలోభాలకు గురికావద్దని ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ మహబూబీ అన్నారు. స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో విద్యార్థినులకు మార్చ్‌ 100రోజుల కార్యక్రమంలో భాగంగా మంగళవారం ‘మేలుకొలుపు’ అంశంపై అవగాహన కల్పించారు. అనంతరం దిశ యాప్‌ను ప్రతి ఒక్క విద్యార్థినీ అందుబాటులో ఉంచుకుని ఆపద వచ్చినప్పుడు ఉపయోగించాలన్నారు.  సమాచారం ఇచ్చిన 5 నిమిషాల్లో రక్షణ ఇచ్చేందుకు పోలీసులు మీ వద్దకు చేరుకుంటారని మహిళా పోలీస్‌ లక్ష్మి వివరించారు.  కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ వెంకటేశ్వర్లు, మహిళా అధ్యాపకులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, మహిళా పోలీసులు  పాల్గొన్నారు. 

Advertisement
Advertisement
Advertisement