బల్దియాలో పాతుకుపోయారు!

ABN , First Publish Date - 2020-02-20T09:17:44+05:30 IST

జిల్లాలోని కామారెడ్డి బల్ది యాలో కొంతమంది ఉద్యోగులు పాతికేళ్లుగా పాతుకుపోయారు. వారికి ప్రజాప్రతినిధుల అండదండలు ఉండటంతో ఈ తంతు కొన సాగుతోందన్న ఆరోపణలు వస్తున్నాయి.

బల్దియాలో పాతుకుపోయారు!

కామారెడ్డి, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని కామారెడ్డి బల్ది యాలో కొంతమంది ఉద్యోగులు పాతికేళ్లుగా పాతుకుపోయారు. వారికి ప్రజాప్రతినిధుల అండదండలు ఉండటంతో ఈ తంతు కొన సాగుతోందన్న ఆరోపణలు వస్తున్నాయి. బ దిలీలు జరిగిన వారు కొద్ది రోజులు మాత్ర మే వెళ్లి మళ్లీ వచ్చి ఇక్కడే విధులు నిర్వహి స్తున్న వారు కొందరయితే.. బదిలైనా వెళ్ల కుండా ఉన్నతాధికారులను మచ్చిక చేసుకొ ని.. ప్రజాప్రతినిధుల అండదండలతో ఇక్కడే విధులు నిర్వర్తిస్తున్నారు. ఎంతో మంది ఉ ద్యోగులు బదిలీ అవుతున్నా.. వారు మాత్రం కామారెడ్డి బల్దియాను విడడం లేదు. కామా రెడ్డి పాలకవర్గంలోని కొందరు ప్రజాప్రతిని ధుల అండదండలు పుష్కలంగా ఉండటం తోనే సదరు ఉద్యోగులు ఇక్కడే ఉంటూ వారి పనులను చక్క పెట్టడమే కాకుండా వ సూళ్ల వాటల పంపకంలో కీలకపాత్రను పొ షిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.


బల్దియాలో వారిదే రాజ్యం..

కామారెడ్డి బల్దియాలో పాతికేళ్లుగా పాతు కపోయిన కొందరు అధికారులు, సిబ్బందితే ఆడిదే ఆట, పాడిందే పాట అన్న చందంగా మారింది. ఐదేళ్లకోసారి బల్దియా పాలకవర్గా లు మారుతున్నప్పటికీ సదరు ఉద్యోగులు, అధికారులు మాత్రం బదిలి కావడం లేదు. బల్దియాలోని సానిటేషన్‌, రెవెన్యూ, టౌన్‌ప్లా నింగ్‌, ఇంజనీరింగ్‌ సెక్షన్‌, పరిపాలన విభా గాల్లో కొందరు ఉద్యోగులు, సిబ్బంది ఏళ్ల త రబడి ఇక్కడే పాతుకుపోయి విధులు నిర్వ ర్తిస్తున్నారు. కామారెడ్డి పట్టణంలోని ఓ ఐ దుగురు నాయకుల అండదండలు పుష్కలం గా ఉండటంతో సదరు ఉద్యోగులను ట్రాన్స్‌ పర్‌ చేయించేందుకు ఎవరూ ముందుకు రా వడం లేదు. ఈ ఐదుగురు నేతలు ఆయా రాజకీయ పార్టీలకు చెందిన వారు కావడం.. వీరంతా సిండికేట్‌ కావడంతో బల్దియాలో వారి మాటలే చెల్లుబాటు అవుతున్నాయి. వారిని కాదని వ్యతిరేకంగా మాట్లాడే వారిపై వేటు పడేలా పావులు కదుపుతుంటారు.  ఇ లా ప్రజాప్రతినిధుల ఉన్నతధికారుల అం డదండలతోనే ట్రాన్స్‌ఫర్‌ కాకుండా విధులు నిర్వహిస్తున్నారనే ఆరోపణలున్నాయి. అవినీ తికి అలవాటు పడిన కొందరు ఉద్యోగులు, సిబ్బందిని ట్రాన్స్‌ఫర్‌ చేస్తేనే కార్యాలయంలో అక్రమాలకు అడ్డుకడుతుందని వాదన విన్పి స్తోంది. రామారెడ్డి మున్సిపాలిటీలో ఎనిమిది మంది ఉద్యోగులు పాతికేళ్లుగా ఇక్కడే విధు లు నిర్వహిస్తున్నారు. వివిధ పనుల నిమి త్తం బల్దియాకు వచ్చే వారి నుంచి డబ్బులు వసూళ్లు చేసి పనులు చక్క పెడుతున్నారు.


బదిలైనా.. ఇక్కడే విధులు

బల్దియా ఉద్యోగులు బదిలీ జరిగినప్పుడు కొన్ని రోజులు ఇతర చోటుకు వెళ్లి తిరిగి వా రు కామారెడ్డి బల్దియాకు వచ్చి చేరుకుంటు న్నారు. హైదారాబాద్‌లోని మున్సిపల్‌ శాఖ ప్రధాన కార్యాలయంలో పనిచేసే కొంత మంది ఉన్నతాధికారులకు ముడుపులు అ ప్పజెప్పి తిరిగి ఇక్కడికి వస్తున్నారు. కొంత మంది ఉద్యోగులు యూనియన్‌ నాయకు లుగా చలామణి అవుతున్నారు. కొంతమంది కి ప్రమోషన్లు వచ్చినప్పటికీ ప్రమోషన్లు తీసుకోకుండా కామారెడ్డి బల్దియాలో విధు లు నిర్వహిస్తున్నారంటే వారికి ఏ మేర డ బ్బులు అందుతున్నాయో అర్థం చేసుకోవ చ్చు. బల్దియాలో పనిచేసే ఓ విభాగానికి చెందిన అధికారి మరికొన్ని సెక్షన్‌లకు ఇన్‌ చార్జిగా వ్యవహరిస్తూ.. బదిలీ అవుతుందన్న సంకేతాలతో ఆ బదిలీని కాకుండా ఆపుకు న్నారని వినికిడి. మరో ఉద్యోగి 20 ఏళ్లుగా ఇక్కడే విధులు నిర్వహిస్తూ ప్రమోషన్లు వ చ్చినా తీసుకొకుండా ఇక్కడే పనులు చక్కబె డుతున్నారు. ప్రధానంగా  సానిటేషన్‌, టౌన్‌ ప్లానింగ్‌లోని కొందరు అధికారులు, సిబ్బంది తీరుపై బల్దియాలోనే కాకుండా పట్టణ ప్రజ ల్లోనూ తీవ్ర విమర్శలే ఎదురవుతున్నాయి. పాలకవర్గలంలోనూ కొందరు ప్రజాప్రతి నిధుల సహకారంతో వసూళ్లకు పాల్పడుతు న్నారు. ఇక్కడే విధులు నిర్వహించేందుకు ఆసక్తి చూపుతున్నారన్న విమర్శలున్నాయి.


ఉన్నతాధికారులను మచ్చిక చేసుకోవడంలో సిద్ధహస్తులు

బల్దియాలో క్షేత్రస్థాయిలోంచి మామూళ్ల ను ముక్కు పిండి వసూళ్లు చేస్తూ.. కొంత మంది బల్దియా ప్రజాప్రతినిధులకు లక్షల్లో ముట్టచెప్పుతున్నారు. అలాగే బల్దియాకు వ చ్చే ఉన్నతాధికారులకు నెలసారి మాముళ్లు ఇచ్చి మచ్చిక చేసుకోవడంలో సదరు ఉద్యో గులు, సిబ్బంది సిద్ధహస్తులుగా మారుతు న్నారు. వీరు మారారా అంటూ కొందరు బ హిరంగంగా విమర్శిస్తున్నా వాటిని అధికారు లు పట్టించుకోవడం లేదు. ప్రజాప్రతినిధుల ఆశీర్వాదాలు, ఉన్నతాధికారుల అండదండ లుంటే సరిపోతుందనే కోణంలో వారు విధు లు నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. శానిటేష న్‌, వాటర్‌వర్క్స్‌, రెవెన్యూ, స్ర్టిట్‌లైట్‌, టౌన్‌ ప్లానింగ్‌, ఇంజనీరింగ్‌ విభాగాల్లో వారు తిష్ట వేసి ఆడిందే ఆటగా సాగిస్తున్నారు. దీంతో బల్దియాలో జరుగుతున్న అవినీతి బాగోతం వారికి బాగ వంటపట్టింది. దీంతో బయటకు హుందాగానే కన్పిస్తున్నా క్షేత్రస్థాయిలో అం దినకాడికి దండుకుంటున్నారు. అన్న రేటు ఇవ్వకుంటే పనులు కావు. బిల్లులు పాస్‌ కా వు. దీంతో వారు చెప్పింది విని వారికి అడిగి నంత ముట్టచెప్పి కొందరు దిక్కు లేక బిల్లు లు పొందుతున్నారు. మరికొందరు బల్దియా కు తెచ్చే సామగ్రిలో పర్సెటింజీలు అప్పగిం చి పనులు చేసుకుంటున్నారు.


అదనపు కలెక్టర్‌, కొత్త కమిషనర్లతోనైనా చెక్‌ పడేనా?

స్థానిక సంస్థల బలోపేతానికి మున్సిపాలి టీల్లో నూతన ఒరవడిని సృష్టించేందుకు రా ష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుం ది. ఇందులో భాగంగా మున్సిపాలిటీల పర్య వేక్షణకు అదనపు కలెక్టర్లను నిమమించడం, కొత్త కమిషనర్లను ఏర్పాటు చేసింది. కామా రెడ్డి బల్దియాతోపాటు బాన్సువాడ, ఎల్లారెడ్డి, మున్సిపాలిటీల పర్యవేక్షణకు అదనపు కలెక్ట ర్‌ వెంకటేశ్‌దొత్రే నియమితులయ్యారు.  పూ ర్తిస్థాయి కమిషనర్‌ లేకపోవడంతో కామారె డ్డి మున్సిపాలిటీ ఇన్‌చార్జీ పాలనలో గడి త ప్పుతూ వచ్చింది. రెండ్రోజుల క్రితం కామారె డ్డితోపాటు ఎల్లారెడ్డి మున్సిపాలిటీలకు కొత్త కమిషనర్లకు ప్రభుత్వం నిమమించింది. అద నపు కలెక్టర్‌, కొత్త కమిషనర్ల నియామకంతో కామారెడ్డి బల్దియాలో యేండ్ల తరబడి పా తుకుపోయిన అధికారులు, ఉద్యోగులకు ఎ లా చెక్‌ పెడుతారో చూడాలి.

Updated Date - 2020-02-20T09:17:44+05:30 IST