బళ్లారి కార్పొరేషన్‌ ఎన్నికల్లో 186 మంది అభ్యర్థులు

ABN , First Publish Date - 2021-04-21T17:08:17+05:30 IST

ఈ నెల 27న జరిగే బళ్లారి సిటీ కార్పొరేషన్‌ ఎన్నికలకు సంబంధించి 39 వార్డుల్లో పోటీలో నిలిచి అభ్యర్థుల జాబితాను జిల్లా ఎన్నికల అధికారు

బళ్లారి కార్పొరేషన్‌ ఎన్నికల్లో 186 మంది అభ్యర్థులు

- స్వతంత్ర అభ్యర్థులుగా రంగంలో 65 మంది 

- 30వ వార్డులో అత్యధికంగా 11 మంది పోటీ 

- 2వ వార్డులో కాంగ్రెస్-బీజేపీ మధ్యే... 

- 5 వార్డులకే పరిమితమైన జేడిఎస్‌..


బళ్లారి: ఈ నెల 27న జరిగే బళ్లారి సిటీ కార్పొరేషన్‌ ఎన్నికలకు సంబంధించి 39 వార్డుల్లో  పోటీలో నిలిచి అభ్యర్థుల జాబితాను జిల్లా ఎన్నికల అధికారులు విడుదల చేశారు. నామినేషన్‌ ఉపసంహరణకు సోమవారం ఆఖరు కావడంతో 39 వార్డులకు 244 మంది నామినేషన్‌లు వేయగా, 19 మంది అభ్యర్థుల నామినేషన్లు వివిధ కారణాలతో తిరస్కరించారు. మిగిలిన 225 మంది అభ్యర్థుల్లో  39 మంది స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. కార్పొరేషన్‌ పరిధిలోని 39 వార్డుల్లో  బీజేపీ, కాంగ్రెస్‌ అభ్యర్థులు బరిలో నిలిచారు. జే డియస్‌, జనహిత పార్టీలు తలా 5 స్థానాల్లో, ఎన్‌సీపీ 9స్థానాల్లో, కేజీపీ, శివసేన, కర్ణాటక రాష్ట్ర సమితి త లా 2 వార్డుల్లో, ఆమ్‌ ఆద్మీపార్టీ 6 స్థానాల్లో, సమాజ వాది పార్టీ, కేఆర్‌ఎస్లు, ఏఐఎంఐఎం తలా 4 వార్డుల్లో పోటీ చేశారు. కార్పొరేషన్‌ పరిధిలో 39 వార్డుల్లో 2వ వార్డులో మాత్రమే కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థులు పోటీ నెలకొంది. ఇది అతి తక్కువ అభ్యర్థులు ఉన్న వార్డుగా నమోదయింది. మిగిలిన వార్డుల్లో 30వ వార్డులో బీజేపీ, కాంగ్రెస్‌ ప్రధాన పార్టీల అభ్యర్థులతో చేరి మొత్తం 11 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఇక్కడ కాంగ్రెస్‌, బీజేపీ, జేడియస్‌, ఎన్‌సీపీ, కేఆర్‌ఎస్తో పాటు ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులు పోటీలో నిలిచారు. మిగిలిన 3,9,13వ వార్డుల్లో 9 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. చాలా వార్డుల్లో బీజేపీ, కాంగ్రెస్‌ అభ్యర్థుల మధ్యనే పోటీ నెలకొంది. ఐదారు వార్డుల్లో పోటీ తీవ్రంగా ఉంది. వీటిలో 3,30,35వ వార్డుల్లో రెబల్‌ అభ్యర్థులు ప్రాబల్యం ఎక్కువగా కనిపిస్తోంది. రాష్ట్రంలో కొవిడ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా నిబంధనలు కట్టుదిట్టం చేయడంతో మంగళవారం నుంచి ఇంటింట ప్రచారానికి బ్రేక్‌ పడింది. 

Updated Date - 2021-04-21T17:08:17+05:30 IST