బాలానగర్‌ బ్రిడ్జి కూలిందంటూ వదంతులు

ABN , First Publish Date - 2021-02-25T06:51:25+05:30 IST

బాలానగర్‌లో నిర్మాణం చివరిదశలో ఉన్న బ్రిడ్జి కూలిందని ఇద్దరు ఆకతాయిలు సోషల్‌ మీడియాలో చేసిన పాత పోస్టింగ్‌తో బాలానగర్‌ ప్రాంత వాసులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు.

బాలానగర్‌ బ్రిడ్జి కూలిందంటూ వదంతులు

 ఇద్దరు ఆకతాయిలపై కేసు

బాలానగర్‌/హైదరాబాద్‌సిటీ, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): బాలానగర్‌లో నిర్మాణం చివరిదశలో ఉన్న బ్రిడ్జి కూలిందని  ఇద్దరు ఆకతాయిలు సోషల్‌ మీడియాలో చేసిన పాత పోస్టింగ్‌తో బాలానగర్‌ ప్రాంత వాసులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. బ్రిడ్జి ఎందుకు కూలుతుందని కొందరు అనుమానం వ్యక్తం చేస్తుంటే.. మరి కొందరు వాస్తవాలను తెలుసుకునేందుకు బ్రిడ్జివద్దకు పరుగులు తీశారు. స్థానికుల నుంచి వచ్చే ఫోన్‌ కాల్స్‌తో అలర్ట్‌ అయిన  పోలీసులు అదంతా ఫేక్‌ న్యూస్‌ అని గ్రహించి, సోషల్‌ మీడియాలో రెండేళ్ల క్రితం పుణెలో కూలిన బ్రిడ్జికి సంబంధించిన వీడియోలు ఎలా వచ్చాయి, ఎవరు పెట్టారనే వివరాలు తెలుసుకున్నారు. వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది సనత్‌నగర్‌కు చెందిన ఆకునూరి శ్రీనివాస్‌, వినోద్‌గా గుర్తించి వారిపై కేసు నమోదు చేశారు. శ్రీనివాస్‌ సనత్‌నగర్‌లో ఓ ట్రావెల్‌ ఏజెన్సీలో పనిచేస్తున్నట్లు గుర్తించారు. ఫ్లై ఓవర్‌ను అత్యంత భద్రతా ప్రమాణాలతో నిర్మిస్తున్నామని హెచ్‌ఎండీఏ ఎస్‌ఈ యూసుఫ్‌ హుస్సేన్‌ తెలిపారు.

Updated Date - 2021-02-25T06:51:25+05:30 IST