Abn logo
Feb 24 2021 @ 18:24PM

‘బాలమిత్ర’.. చిన్నప్పటి కథల సినిమా కాదిది

విఎస్, శ్రీ సాయి బాలాజీ ఫిల్మ్స్ బ్యానర్లపై రంగ, శశికళ, కియారెడ్డి, అనూష, దయానంద రెడ్డి, మీసాల లక్ష్మణ్ నటీనటులుగా.. శైలేష్ తివారి దర్శకత్వంలో శైలేష్ తివారి, బొద్దుల లక్ష్మణ్ లు నిర్మించిన చిత్రం ‘బాలమిత్ర’. ఈ చిత్రం ఫిబ్రవరి 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలవుతున్న సందర్భంగా చిత్రయూనిట్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి చిత్ర విశేషాలను తెలియజేసింది.


ఈ కార్యక్రమంలో డైరెక్టర్ శైలేష్ తివారి మాట్లాడుతూ.. ''2013 మరియు 2014 రామ్‌ గోపాల్ వర్మ, మోహన్ బాబుగారు.. ఎందుకు ఫిల్మ్ ఇండస్ట్రీలో డిస్ట్రిబ్యూటర్స్ లిమిట్‌గా ఉన్నారు.. కామన్ పీపుల్స్ ఎందుకు డిస్ట్రిబ్యూషన్ చేయకూడదనే వారి ఆలోచన నుంచి నేను డిస్ట్రిబ్యూటర్‌గా, నిర్మాతగా, దర్శకుడుగా ఆ రోజు వారి ఆలోచన నుంచే ఈ రోజు మీముందు ఇలా నిలుచున్నాను. ఈ సినిమా చిన్నప్పుడు చదువుకున్న బాలమిత్ర , చందమామ కథల సినిమా కాదు. ఈ చిత్రం సస్పెన్స్ థ్రిల్లర్ అంశాలతో బిగినింగ్ నుండి ఎండింగ్ వరకు ప్రతి ఒక్కరిని థ్రిల్ చేస్తుంది. సినిమా చూస్తున్న ప్రతి ఒక్కరికి కచ్చితంగా గూస్ బమ్స్ వస్తాయి. నిర్మాత లక్ష్మణ్ గారు కంటెంట్‌, క్వాలిటీ గురించి మాత్రమే ఆలోచించండని బడ్జెట్ గురించి ఆలోచించవద్దని ప్రోత్సహించారు. వారి  ప్రోత్సహంతో సినిమా బాగా వచ్చింది. ఇందులో నటీనటులందరూ పోటీపడి నటించారు. ఈ నెల 26న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేస్తున్నాము. మా చిత్రాన్ని ప్రేక్షకులందరు చూసి ఆశీర్వదించాలని కోరుతున్నాను.." అన్నారు.

కో డైరెక్టర్ ప్రకాష్ మాట్లాడుతూ.. మంచి కథ కథనంతో సస్పెన్స్ థ్రిల్లర్‌గా వస్తున్న మా సినిమాను చూసిన వారందరూ కచ్చితంగా షాక్ అవుతారు. చూసిన ప్రేక్షకులు అందరికీ మా సినిమా తప్పక నచ్చుతుంది అని తెలుపగా.. హీరో రంగా మాట్లాడుతూ.. నా మొదటి సినిమా 'స్పెషల్'  తర్వాత నేను చేస్తున్న రెండవ చిత్రమే 'బాలమిత్ర'. ప్రతి క్యారెక్టర్‌కు జస్టిఫికేషన్ ఉండేలా శైలేష్‌గారు ఈ సినిమాని తెరకెక్కించారు.. అన్నారు. అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు తెలిపారు హీరోయిన్లు కియా మరియు అనుషా రెడ్డి. సంగీత దర్శకుడు జయవర్ధన్ మాట్లాడుతూ.. సంగీత దర్శకుడిగా నాకిది 14వ మూవీ. ఇప్పటివరకు నేను లవ్ ,రొమాన్స్ సినిమాలు చేశాను. బాలమిత్ర వంటి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని ఛాలెంజింగ్‌గా తీసుకుని చేయడం జరిగింది.. అని తెలిపారు.


నిర్మాత లక్ష్మణ్ మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి సినిమా అంటే ఇష్టం ఉండేది. నా ఫ్రెండ్‌ శైలేష్, తను తీసిన కొన్ని షార్ట్ ఫిల్మ్స్‌ గురించి నాతో డిస్కస్‌ చేసేవాడు. ఆ క్రమంలోనే  సినిమా చేద్దామనే ఆలోచన మాకు వచ్చింది. శైలేష్ కథ తయారు చేసి వినిపించడంతో ఇద్దరం ఈ మూవీ  చేయడం జరిగింది. సస్పెన్స్, థ్రిల్లర్‌తో పాటు మంచి ఎమోషన్ నిండిన కథతో ప్రతి ఒక్కరినీ అలరించే విధంగా ఈ సినిమా ఉంటుంది. సినిమా కూడా కంటెంట్, టేకింగ్ పరంగా పెద్ద సినిమాలకు పోటాపోటీకి ఉంటుందని చెప్పగలను. సస్పెన్స్ థ్రిల్లర్‌గా వస్తున్న మా 'బాలమిత్ర' చిత్రం ప్రతి ఒక్కరికీ తప్పక నచ్చుతుందని అన్నారు.

Advertisement
Advertisement
Advertisement