Abn logo
Jun 3 2020 @ 09:38AM

బాలకృష్ణ సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నారా?

ప్రేక్షకులకు, నందమూరి అభిమానులకు తన పుట్టిన రోజు సందర్భంగా నటరత్న బాలకృష్ణ సర్‌ప్రైజ్ గిఫ్ట్ అందించబోతున్నారట. బాలయ్య ప్రస్తుతం బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న చిత్రంలో నటిస్తున్నారు. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ పూర్తయింది. ఈ సినిమాకు `మోనార్క్` అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది.


ఈ నెల పదో తేదీన బాలయ్య జన్మదినోత్సవం. ఈ సందర్భంగా కొత్త సినిమా టైటిల్‌, ఫస్ట్‌లుక్‌తో పాటు మొదటి పాటను కూడా విడుదల చేయబోతున్నారట. ఈ పాటను బాలయ్య స్వయంగా ఆలపించినట్టు సమాచారం. లాక్‌డౌన్‌కు ముందే ఈ పాటను రికార్డు చేశారట. గతంలో `పైసా వసూల్` సినిమాలో బాలయ్య ఓ పాట పాడిన సంగతి తెలిసిందే. మళ్లీ ఇప్పుడు బోయపాటి సినిమా కోసం కూడా బాలయ్య గొంతు సవరించుకున్నారట. 

Advertisement
Advertisement
Advertisement