నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సెట్స్‌పై ఉంది. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ ఎవరితో వర్క్ చేస్తారనే దానిపై క్లారిటీ లేదు. కానీ చాలా మంది దర్శకుల పేర్లు మాత్రం వినిపిస్తున్నాయి. తాజా సమాచారం మేరకు దర్శకుడు శ్రీవాస్‌తో బాలకృష్ణ మరో సినిమా చేయబోతున్నారట. రీసెంట్గా రైటర్ కోన వెంకట్ ఓ కథను బాలకృష్ణకు వినిపించారట. ఆయనకు కథ బాగా నచ్చడంతో నెక్ట్స్ మూవీగా చేద్దామని అన్నారట. సినిమాను డైరెక్టర్ శ్రీవాస్ తెరకెక్కిస్తారని టాక్. ఇంతకు ముందు బాలకృష్ణ హీరోగా చేసిన 'డిక్టేటర్' సినిమాను శ్రీవాస్ డైరెక్ట్ చేశారు. అన్ని అనుకున్నట్లు కుదిరితే నెక్ట్స్ మూవీని శ్రీవాస్ డైరెక్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సమాచారం.