Abn logo
Feb 21 2020 @ 18:09PM

బాలయ్యకు దొరకని హీరోయిన్... చివరకి..!

దర్శకుడు బోయపాటి శ్రీను-నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటించేందుకు తొలుత నయనతారను, ఆ తర్వాత శ్రియను సంప్రదించారట. అయితే డేట్లు సర్దుబాట్లు కాకపోవడంతో వీరిద్దరు ఈ సినిమాకు నో చెప్పారట. నిజానికి ఈ సినిమా ఎప్పుడో సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది. హీరోయిన్లు ఫిక్స్ కాకపోవడంతో ఆలస్యమవుతూ వచ్చింది. దీంతో బాలయ్య అసంతృప్తిగా ఉన్నారట.


త్వరగా హీరోయిన్లను ఎంపిక చేయాలని బోయపాటికి సూచించారట. వెంటనే హీరోయిన్ అంజలి పేరును పరిశీలించారట. ఆమెను కూడా సంప్రదించారట. అంజలి ఓకే చెప్పినట్లు సమాచారం. ఈ సినిమాకు ఓ హీరోయిన్‌గా అంజలి దాదాపు ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. మరో హీరోయిన్‌గా కొత్తవారిని తీసుకోవాలని నిర్ణయించుకున్నారట. ఇందుకోసం బోయపాటి వెతుకులాట మొదలు పెట్టారట. త్వరలోనే రెండో హీరోయిన్‌ను కూడా ఎంపిక చేసి వెంటనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్తారట. ఈ చిత్రంలో బాలకృష్ణ రెండు విభిన్నమైన కోణాల్లో కనిపించనున్నారు. బోయపాటి-బాలయ్య కాంబోలో వచ్చిన ‘సింహా’, ‘లెజెండ్’ సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఈ కాంబో మూడోసారి రిపీట్ కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. 

Advertisement
Advertisement
Advertisement