Abn logo
Dec 2 2020 @ 02:43AM

క్యాంపస్‌లో... బాలకృష్ణ తర్వాత ఇంటిలో!

బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న తాజా సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. బుధవారం నుంచి మూడు రోజుల పాటు ఓ క్యాంపస్‌లో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. ఆ తర్వాత హీరో ఇంటి సెట్‌లో ఇతర ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. అందుకోసం రామోజీ ఫిల్మ్‌ సిటీలో భారీ ఇంటి సెట్‌ దాదాపుగా సిద్ధమైంది. లాక్‌డౌన్‌ తర్వాత రామోజీ ఫిల్మ్‌ సిటీలోనే సినిమా చిత్రీకరణ పునఃప్రారంభించారు. క్యాంపస్‌లో సన్నివేశాలు చిత్రీకరించిన తర్వాత మళ్లీ అక్కడికే వెళ్లనున్నారు. మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్‌ కథానాయిక. శ్రీకాంత్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఆయన కాకుండా ఈ సినిమా ద్వారా మరో కొత్త ప్రతినాయకుడిని పరిచయం చేస్తున్నారని తెలిసింది. త్వరలో అతని వివరాలు ప్రకటించనున్నారు. ఈ నెలాఖరులోపు టాకీ పూర్తి చేసేలా దర్శక, నిర్మాతలు ప్రణాళికలు సిద్ధం చేశారు. కొత్త ఏడాదిలో పాటలు చిత్రీకరించి విడుదలకు సినిమాను సిద్ధం చేయనున్నారు.

Advertisement
Advertisement
Advertisement