Abn logo
May 24 2020 @ 03:55AM

నేను అండగా ఉంటా

కోటంరెడ్డికి బాలకృష్ణ భరోసా


నెల్లూరు(వ్యవసాయం) మే 23: నుడా మాజీ చైర్మన్‌ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డిపై కొందరు అసభ్యకరమైన పోస్టులు పెట్టినట్లు సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలకృష్ణ స్పందించారు. శనివారం కోటంరెడ్డికి ఫోన్‌చేసి పరామర్శించారు. పోస్టింగులు ఎవరు పెట్టారన్న దానిపై ఆరా తీశారు. నీకు నేను ఆండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకునే వరకు పోరాటం చేయాలని కోటంరెడ్డికి బాలకృష్ణ సూచించారు.

Advertisement
Advertisement