Abn logo
Sep 27 2020 @ 13:34PM

ఇండో జెర్మన్‌ ఫెస్టివల్‌లో 'బాల'

Kaakateeya

ఆయుష్మాన్‌ ఖురానా టైటిల్‌ పాత్రలో నటించిన చిత్రం 'బాల'. 2019లో విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలను అందుకుంది. అమర్‌ కౌశిక్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. యామీ గౌతమ్‌, భూమి పెడ్నేకర్‌ హీరోయిన్స్‌గా నటించారు. ఇప్పుడు ఈ సినిమాకు అరుదైన గౌరవం దక్కింది. అదేంటంటే 'బాల' చిత్రం ఇండో జెర్మన్‌ ఫిస్టివల్‌ 2020లో ప్రదర్శితం కానుంది. ఈ ఫిలిం ఫెస్టివల్‌ బెర్లిన్‌లో జరుగుతుంది. ఆదివారం బాల చిత్రాన్ని ఈ ఫెస్టివల్‌లో ప్రదర్శిస్తారట. పెళ్లి కాకుండానే ఓ అబ్బాయిని బట్టతల వస్తుంది. ఆ సమస్యను తొలగించుకోవడానికి ఆ అబ్బాయి ఏం చేస్తాడు? అప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయనే దాన్ని కామెడీగా, ఎమోషనల్‌ కోణంలో తెరకెక్కించారు. 


Advertisement
Advertisement
Advertisement