Apr 20 2021 @ 15:45PM

అనీల్‌ రావిపూడికి బాలయ్య గ్రీన్‌ సిగ్నల్‌..!

సినిమా వెంట సినిమాలు చేస్తున్న నటసింహ నందమూరి బాలకృష్ణ ఓ యంగ్‌ డైరెక్టర్‌కి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆ యంగ్‌ డైరెక్టర్‌ ఎవరో కాదు.. అనీల్‌ రావిపూడి. ఇది వరకే బాలకృష్ణ, అనీల్ రావిపూడి కాంబినేషన్‌లో రామారావుగారు అనే సినిమా రూపొందనున్నట్లు వార్తలు వినిపించాయి. కానీ.. ఆ సినిమా అప్పట్లో సెట్స్‌పైకి వెళ్లలేకపోయింది. కానీ లేటెస్ట్ సమాచారం మేరకు వీరి కాంబినేషన్‌లో సినిమా మొదలవుతుందని సమాచారం. ఇటీవల మహేశ్‌తో అనీల్‌ రావిపూడి సినిమా ఉంటుందని వార్తలు వినిపించాయి కానీ ఇప్పుడు మహేశ్‌, త్రివిక్రమ్‌ సినిమా స్టార్ట్‌ అవుతుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో అనీల్‌ రావిపూడి బాలకృష్ణను రీసెంట్‌గా కలిసి స్టోరీ చెప్పాడట. బాలకృష్ణకు స్టోరి నచ్చడంతో వెంటనే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశాడని గోపీచంద్‌ మలినేని సినిమా తర్వాత అనీల్‌ రావిపూడితో సినిమా ఉంటుందని వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. మరిందులో నిజానిజాలేంటో తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.