Abn logo
May 30 2020 @ 07:20AM

బాల‌కృష్ణ 106వ సినిమా టైటిల్‌..?

నంద‌మూరి బాల‌కృష్ణ 106వ చిత్రం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌కుడు. క‌రోనా ప్ర‌భావంతో మొద‌టి షెడ్యూల్ త‌ర్వాత చిత్రీక‌ర‌ణ‌ను తాత్కాలికంగా ఆపారు. క‌రోనా ప్ర‌భావం త‌గ్గి షూటింగ్స్ ప్రారంభం కాగానే.. త‌దుప‌రి షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. తాజాగా ఈ సినిమా టైటిల్ విష‌యంలో ఓ వార్త సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. స‌మాచారం మేర‌కు ఈ చిత్రానికి ‘మోనార్క్’ అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్లు టాక్‌. బాల‌కృష్ణ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ టైటిల్‌ను అనౌన్స్ చేసే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. సింహా, లెజెండ్ వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల త‌ర్వాత బాల‌కృష్ణ‌, బోయపాటి శ్రీను కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం కావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. 

Advertisement
Advertisement
Advertisement