‘బక్వాస్‌... జుమ్లా... పార్టీ’

ABN , First Publish Date - 2022-05-15T08:38:21+05:30 IST

బీజేపీని బక్వా్‌స(బీ), జుమ్లా(జే), పార్టీ(పీ) అని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు.

‘బక్వాస్‌... జుమ్లా... పార్టీ’

బీజేపీపై కేటీఆర్‌ ట్వీట్‌


హైదరాబాద్‌: బీజేపీని  బక్వా్‌స(బీ), జుమ్లా(జే), పార్టీ(పీ) అని  మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా టీఆర్‌ఎస్‌పై గుప్పించిన విమర్శలకు ఆయన ట్విటర్‌ వేదికగా శనివారం స్పందించారు. రాష్ట్రంలో రాజకీయ పర్యాటకం కొనసాగుతోందని, ఏక్‌ ఔర్‌ టూరిస్ట్‌ ఆజ్‌... ఆయా... ఖాయా... పియా... చల్‌దియా(మరో రాజకీయ పర్యాటకుడు ఈ రోజు వచ్చాడు. తిన్నాడు. తాగాడు. వెళ్లిపోయాడు) అంటూ చురకలంటించారు.  ‘8 సాల్‌మే... కుచ్‌ నహీ దియా తెలంగాణకు... ఆజ్‌ భీ వహీ సిల్‌సిలా(8 ఏళ్లలో తెలంగాణకు ఏమీ ఇవ్వకుండా, మళ్లీ అదే పద్ధతి అనుసరిస్తున్నారు) అంటూ మండిపడ్డారు. వహీ జుమ్లాబాజీ ఔర్‌ దోఖేబాజీ(అవే హామీలు, అవే మోసాలు), బీ-బక్వాస్‌, జే-జుమ్లా, పీ-పార్టీ పేరుతో వీరు ఉన్నారంటూ వ్యంగ్యంగా స్పందించారు. 


Updated Date - 2022-05-15T08:38:21+05:30 IST