భక్తిశ్రద్ధలతో దసరా ఉత్సవాలు

ABN , First Publish Date - 2022-09-30T03:46:54+05:30 IST

దసరా ఉత్సవాలను ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. పట్టణంలోని దుర్గాభవాని ఆలయంలో అమ్మవారు అన్న

భక్తిశ్రద్ధలతో దసరా ఉత్సవాలు
కందుకూరు : అన్నపూర్ణాదేవి అలంకారంలో దుర్గాభవాని అమ్మవారు

కందుకూరు, సెప్టెంబరు 29: దసరా ఉత్సవాలను ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. పట్టణంలోని దుర్గాభవాని  ఆలయంలో అమ్మవారు అన్నపూర్ణాదేవిగా గురువారం దర్శనమిచ్చారు.  శ్రీవాసనీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయంలో అన్నపూర్ణాదేవిగా దర్శనమివ్వగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు  చేశారు.

కావలిటౌన్‌ : స్థానిక కళుగోళశాంభవి అమ్మవారు గురువారం అన్నపూర్ణగా దర్శనమిచ్చారు. అనంతరం అమ్మవారికి నందివాహనంపై గుడిఉత్సవం నిర్వహించారు. పాతూరు శివాలయంలో దుర్గాభ్రమరాంభిక అమ్మవారు భువనేశ్వరీదేవీగా దర్శనమిచ్చారు. విష్టాలయంలో రాజ్యలక్ష్మి అమ్మవారు గజలక్ష్మిగా,  వడ్డెపాలెంలోని శ్రీకనకదుర్గ లలితత్రిపురాసుందరిగా దర్శనమిచ్చారు. భక్తులు పెద్దఎత్తున ఆలయాలకు చేరుకుని పూజలు నిర్వహించారు.  బృందావనం హౌసింగ్‌ కాలనీలోని శ్రీవేంకటేశ్వర ఆలయంలో గురువారం శ్రీవారికి సింహవాహన సేవలందించారు.  సాయత్రం ఊంజలసేవలు జరగ్గా రాత్రి శ్రీవారు ముత్యపు పందిరి వాహనంపై  ఊరేగారు.

బిట్రగుంట : బోగోలు మండలం బోగోలు, బిట్రగుంట, నాగులవరం, జువ్వలదిన్నె, జక్కేపల్లి గూడూరు పంచాతీలో గురువారం  వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు అభిషేకాలు జరిగాయి. బోగోలు  షిరిడి సాయి మందిరంలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి మహిళలు ప్రత్యేక అలంకరన  చేశారు.  అక్కరాజువారికండ్రికు చెందిన కడియాల. వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులు అన్నదానం చేశారు

అల్లూరు : మండలంలోని ఇస్కపల్లిలో శ్రీఅన్నపూర్ణ సమేత కాశీవిశ్వేశ్వర స్వామి ఆలయంలో గురువారం విశేష పూజలు, హోమాలు నిర్వహించారు. అమ్మవారు మహాగౌరీ అలంకారంలో దర్శనమిచ్చారు.  అల్లూరు కన్యకాపరమేశ్వరి ఆలయం, దసరా దేవాలయం, కలుగోళమ్మ ఆలయంతోపాటు నార్తుమోపూరు మహాలక్ష్మమ్మ ఆలయం, శివాలయాల్లో విశేష పూజలు నిర్వహించగా, వివిధ అలంకరణల్లో అమ్మవార్లు దర్శనమిచ్చారు. 






Updated Date - 2022-09-30T03:46:54+05:30 IST