శాంతియుత వాతావరణంలో బక్రీద్‌ నిర్వహించుకోవాలి

ABN , First Publish Date - 2022-06-30T05:40:25+05:30 IST

శాంతియుత వాతావరణంలో బక్రీ ద్‌ నిర్వహించుకోవాలని కలెక్టర్‌ గుగులోతు రవి నాయక్‌ అన్నారు.

శాంతియుత వాతావరణంలో బక్రీద్‌ నిర్వహించుకోవాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ రవి

జగిత్యాల, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): శాంతియుత వాతావరణంలో బక్రీ ద్‌ నిర్వహించుకోవాలని కలెక్టర్‌ గుగులోతు రవి నాయక్‌ అన్నారు. బుధ వారం పట్టణంలోని కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లాలో ని ముస్లిం మత పెద్దలు, మున్సిపల్‌, పంచాయతీ, పోలీసు అధికారుల తో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ ర వి మాట్లాడారు. వచ్చే నెల 10వ తేదిన నిర్వహించుకోనున్న బక్రీద్‌ పం డగకు వెటర్నరీ శాఖ అధికారులచే దృవీకరించిన జంతువులను మాత్రమే వినియోగించాలని, పండుగ కోసం వాహనాలలో ఒక ప్రాంతం నుంచి మ రో ప్రాంతానికి తరలించే జంతువులను అధికారులు దృవీకరించినవి మా త్రమే ఉండాలని, పరిమితికి మించి వాహనాలలో పశువులను తరలించ వద్దన్నారు. పండుగ ముగిసే వరకు మున్సిపల్‌, గ్రామ పంచాయతీ ప రిధిలో అధికారులు, సిబ్బంది ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలను చేపట్టా లన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సింధూ శర్మ, ఇంచార్జీ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వినోద్‌ కుమార్‌, జగిత్యాల, మెట్‌పల్లి డీఎస్పీలు ప్రకాశ్‌, రవీందర్‌, ఆయా మున్సిపల్‌ కమిషనర్లు, జిల్లాలోని పలు ప్రాం తాలకు చెందిన ముస్లీం మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-30T05:40:25+05:30 IST