లాక్‌డౌన్ మధ్య తెరుచుకున్న బేకరీలు

ABN , First Publish Date - 2020-04-08T23:54:38+05:30 IST

బేకరీలకు రాష్ట్ర ప్రభుత్వం మినహాయింపు ఇవ్వడంతో కనీస సిబ్బందితో బేకరీలు తిరిగి ప్రారంభమయ్యాయి. మసాలాలు, పొడిగా ఉండే ఐటమ్స్‌..

లాక్‌డౌన్ మధ్య తెరుచుకున్న బేకరీలు

బెంగళూరు: కోవిడ్-19 లాక్‌డౌన్ కొనసాగుతున్నప్పటికీ బెంగళూరులోని బేకరీలు బుధవారంనాడు తెరచుకున్నాయి. బేకరీలకు రాష్ట్ర ప్రభుత్వం మినహాయింపు ఇవ్వడంతో కనీస సిబ్బందితో బేకరీలు తిరిగి ప్రారంభమయ్యాయి. మసాలాలు, పొడిగా ఉండే ఐటమ్స్‌ మాత్రమే అమ్ముతున్నామని, కొనుగోలుదారులను సామాజిక దూరం పాటించాలని కూడా కోరుతున్నామని స్థానిక బ్యాకరీ యజమాని మధు తెలిపారు.


బేకరీలు తిరిగి తెరుచుకోవడంతో స్థానికులు సామాజిక దూరాన్ని పాటిస్తూ ఒకరి తర్వాత మరొకరు బేకరీ ఐటెమ్స్ కొనుగోలు చేస్తుండటం కూడా కనిపించింది. బేకరీ యూనిట్లు అత్యున్నత ప్రమాణాలు పాటించాలని, హైజీన్, శానిటేషన్, సామాజిక దూరం వంటి జాగ్రత్తలు తు.చ. తప్పకుండా పాటించాలని ప్రభుత్వ కార్యదర్శి రాజేంద్ర కుమార్ కటారియా ఆదేశాలు జారీ చేశారు. బేకరీల్లో పార్సిల్‌కు మాత్రమే అనుమతి ఉందని, అక్కడే కూర్చుని తినేందుకు మాత్రం అనుమతించేది లేదని కూడా ఆ సర్క్యులర్ పేర్కొంది.

Updated Date - 2020-04-08T23:54:38+05:30 IST