ఒక్కొక్కరికి.. ఒక్కో నిబంధనా?

ABN , First Publish Date - 2020-10-28T09:12:11+05:30 IST

ఆస్ట్రేలియా పర్యటనకు ముంబై ఇండియన్స్‌ బ్యాట్స్‌మన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ను ఎంపిక చేయకపోవడంపై వెటరన్‌ స్పిన్నర్

ఒక్కొక్కరికి.. ఒక్కో నిబంధనా?

టీమిండియా సెలెక్షన్‌పై భజ్జీ ఫైర్‌

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా పర్యటనకు ముంబై ఇండియన్స్‌ బ్యాట్స్‌మన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ను ఎంపిక చేయకపోవడంపై వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు. జట్టు ఎంపికలో పక్షపాతం చూపిస్తున్నారని బీసీసీఐ, సెలెక్టర్లపై ట్విటర్‌ వేదికగా భజ్జీ అసహనం ప్రదర్శించాడు. ‘సూర్యకుమార్‌ భారత జట్టులోకి రావాలంటే ఇంకేం చేయాలో తెలియడం లేదు. ఐపీఎల్‌, రంజీ, దేశవాళీ పోటీల్లో అతడు అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. నేను అనుకోవడం బీసీసీఐ నిబంధనలు ఒక్కొక్కరికి ఒక్కోలో ఉంటాయేమో? సూర్యకుమార్‌ రికార్డులను సెలెక్టర్లు గమనించాలి’ అని హర్భజన్‌ ట్వీట్‌ చేశాడు. 

Updated Date - 2020-10-28T09:12:11+05:30 IST