ఆర్టీసీ చైర్మన్‌గా బాజిరెడ్డి గోవర్ధన్‌

ABN , First Publish Date - 2021-09-17T06:51:36+05:30 IST

రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) చైర్మన్‌గా నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఆర్టీసీ చైర్మన్‌గా బాజిరెడ్డి గోవర్ధన్‌

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

అనుచరుల సంబరాలు 

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన బాజిరెడ్డి

నిజామాబాద్‌, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) చైర్మన్‌గా నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా లో సీనియర్‌ ఎమ్మెల్యేగా ఉన్న ఆయనకు కేబినెట్‌ హోదాతో కార్పొరేషన్‌ పదవిని కట్టబెట్టింది. ఆర్టీసీలో సంస్కరణలకు సిద్ధమవుతున్న ప్రభు త్వం.. పది రోజుల క్రితమే ఐపీఎస్‌ అధికారి సజ్జన్నార్‌ను ఎండీగా నియమించ గా.. గురువారం చైర్మన్‌గా బాజిరెడ్డి గోవర్ధన్‌ను నియమించింది. రాజకీయాలలో సుమారు 30 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన బాజిరెడ్డి గోవర్ధన్‌.. 4వ సారి ఎ మ్మెల్యేగా ఎన్నికైన సమయంలోనే మంత్రి పదవి వస్తుందని భావించారు. సా మాజిక సమీకరణల్లో భాగంగా మంత్రి పదవి రాకున్నా.. అదే హోదాతో కూడిన ఆర్టీసీ చైర్మన్‌ పదవిని ప్రభుత్వం ఆయనకు కట్టబెట్టింది. సిరికొండ మండలం చీమన్‌పల్లి గ్రామానికి చెందిన బాజిరెడ్డి గోవర్ధన్‌ మొదట పోలీస్‌ పటేల్‌గా రా జకీయ జీవితాన్ని ప్రారంభించారు. తర్వాత గ్రామ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత సిరికొండ ఎంపీపీగా పనిచేశారు. మొదటిసారిగా ఆర్మూర్‌ నియోజకవ ర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత బాన్సువాడ నుంచి కాంగ్రెస్‌ టికెట్‌పై పోటీచేసి గెలిచారు. తెలంగాణ వచ్చిన త ర్వాత 2014లో టీఆర్‌ఎస్‌ పార్టీ టికెట్‌తో నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలుపొందారు. 2018లో కూడా అదే నియోజకవర్గం నుంచి నా లుగో సారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ఆ యన తన రాజకీయ ప్రస్థానంలో సీనియర్‌ నేతలను ఓడించారు. స్వతంత్ర అ భ్యర్థిగా పోటిచేసిన సమయంలో ఆర్మూర్‌లో సంతోష్‌రెడ్డిపైన, బాన్సువాడలో పోచారం శ్రీనివాస్‌రెడ్డిపైన, రూరల్‌లో డీ.శ్రీనివాస్‌పైన గెలిచారు. కరోనాతో ఆదా యం దెబ్బతిని ఇప్పుడిప్పుడే పంజుకుంటున్న సమయంలో ఆయనను సీఎం కే సీఆర్‌ ఆర్టీసీ చైర్మన్‌గా నియమించారు. రాష్ట్రస్థాయిలోనే ఆర్టీసీ అతిపెద్ద కార్పొరేషన్‌. ఈ సంస్థలో వేలాది మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. నష్టాల వల్ల జీతా లు ఇవ్వలేని పరిస్థితిలో సంస్థ ఉంది. సంస్థను మెరుగుపర్చేందుకు ఎండీతో పా టు కీలకంగా పనిచేసే చైర్మన్‌గా రూరల్‌ బాజిరెడ్డిని నియమించారు. గత శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో ఎల్లారెడ్డి మినహా అన్ని స్థానాలను టీఆర్‌ఎస్‌ గెలుచుకుంది. రెండో సారి అధికారంలోకి రాగానే ఉమ్మడి జిల్లాకు స్పీకర్‌తో పాటు ఓ మంత్రి పదవిని ఇచ్చారు. విప్‌ పదవిని కూడా జిల్లాకు ఇచ్చారు. రాష్ట్రస్థాయిలో కార్పొరేషన్‌లో ఉమ్మడి జిల్లాకు చెందినవారిని నియమి ంచారు. ప్రస్తుతం అతిపెద్ద ఆర్టీసీకి కూడా జిల్లా నుంచే ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ను నియమించడంతో ఆయన అనుచరులు సంబరాలు జరుపుకొన్నారు. కా గా.. తనను ఆర్టీసీ చైర్మన్‌గా నియమించడంపట్ల సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్యే బా జిరెడ్డి గోవర్ధన్‌ కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - 2021-09-17T06:51:36+05:30 IST