బజాజ్ ఆటో అదనపు ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా అభినవ్ బింద్రా

ABN , First Publish Date - 2020-05-22T00:21:30+05:30 IST

ఒలింపిక్ గోల్డ్ మెడల్ విజేత అభినవ్ బింద్రాను ఐదేళ్ల కాలానికి గాను అదనపు ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా నియమించినట్టు

బజాజ్ ఆటో అదనపు ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా అభినవ్ బింద్రా

న్యూఢిల్లీ: ఒలింపిక్ గోల్డ్ మెడల్ విజేత అభినవ్ బింద్రాను ఐదేళ్ల కాలానికి గాను అదనపు ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా నియమించినట్టు బజాజ్ ఆటో ప్రకటించింది. ఈ నెల 20 నుంచి ఇది అమల్లోకి వస్తుందని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్ తెలిపింది. ఈ నిర్ణయం జులై 22, 2020న జరగబోయే వార్షిక సర్వసభ్య సమావేశంలో కంపెనీ వాటాదారుల ఆమోదానికి లోబడి ఉంటుందని పేర్కొంది. నానూ పమ్నాని మరణం తర్వాత ఇండిపెండెంట్ డైరెక్టర్ పదవి ఖాళీ ఉందని కంపెనీ తెలిపింది. ఈ నేపథ్యంలోనే బింద్రా నియమాకం జరిగిందని బజాజ్ ఆటో తన ఫైలింగులో పేర్కొంది. ప్రస్తుతం కంపెనీ డైరెక్టర్లలో ఎవరితోనూ బింద్రాకు సంబంధం లేదని వెల్లడించింది. 

Updated Date - 2020-05-22T00:21:30+05:30 IST