Abn logo
Sep 21 2021 @ 01:20AM

ఎట్టకేలకు రాజ్‌ కుంద్రాకు బెయిలు

న్యూఢిల్లీ, సెప్టెంబరు 20: నీలి చిత్రాల వ్యాపారం కేసులో 2 నెలల క్రితం అరెస్టయిన వ్యాపారవేత్త రాజ్‌ కుంద్రాకు ముంబై కోర్టు బెయిల్‌ ఇచ్చింది. బెయిల్‌ కోసం రూ.50 వేల పూచీకత్తు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. ఈనెల 16న ముంబై పోలీసులు కుంద్రా కేసులో 1400 పేజీల చార్జిషీటును కోర్టులో సమర్పించారు. కుంద్రా భార్య శిల్పాషెట్టి సహా 43 మంది సాక్షుల వాంగ్మూలాన్ని పోలీసులు అందులో చేర్చారు.