TS news: జూబ్లీహిల్స్ బాలిక కేసులో మైనర్లకు బెయిల్... జైల్లోనే ఎమ్మెల్యే కుమారుడు

ABN , First Publish Date - 2022-07-27T14:50:43+05:30 IST

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ బాలిక కేసులో మైనర్లకు బెయిల్ మంజూరు అయ్యింది.

TS news: జూబ్లీహిల్స్ బాలిక కేసులో మైనర్లకు బెయిల్... జైల్లోనే ఎమ్మెల్యే కుమారుడు


హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ బాలిక కేసు(Jubileehills girl case)లో మైనర్లకు బెయిల్ మంజూరు అయ్యింది. జువెనైల్ కోర్ట్ (Juvenile court)  మైనర్ల(Minors)కు బెయిల్ మంజూరు చేసింది. గతంలో రెండు సార్లు బెయిల్‌ కోసం పిటిషన్ వేయగా...జువెనైల్ కోర్ట్  రిజెక్ట్ చేసిన విషయం తెలిసిందే. కాగా ఈరోజు షరతులతో కూడిన బెయిల్‌ను కోర్టు మంజూరు చేసింది. ఒక్కో మైనర్కు రూ.5 వేలు చొప్పున పూచీకత్తుతో పాటు, విచారణకు సహకరించాలని ఆదేశించింది. హైదరాబాద్ డీపీఓ ముందు ప్రతి నెలా హాజరు కావాలని మైనర్లకు జువైనల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 


ఎమ్మెల్యే కుమారుడికి బెయిల్ నిరాకరణ

ఈ కేసుకు సంబంధించి ఎమ్మెల్యే కుమారుడికి బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. మొదట జువెనైల్ కోర్టు బెయిల్ నిరాకరించడంతో ఎమ్మెల్యే కుమారుడు హైకోర్టులో అప్పీలు చేసుకున్నాడు. హైకోర్టులో బెయిల్ పిటిషన్ పెండింగ్‌లో ఉన్నందున ఇంకా హోంలోనే ఉన్నాడు. మరోవైపు ఇదే కేసులో నిందితుడు సాదుద్దీన్‌ మాలిక్ బెయిల్‌ను కోర్టు నిరాకరించింది. 

Updated Date - 2022-07-27T14:50:43+05:30 IST