రెహానా ఫాతిమాకు బెయిలు తిరస్కృతి

ABN , First Publish Date - 2020-08-08T07:46:07+05:30 IST

వివాదాస్పద ఉద్యమకారిణి రెహానా ఫాతిమా ముందస్తు బెయిలు కోసం దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. అర్ధ నగ్నంగా ఉన్న తన శరీరంపై తన పిల్లలచేతనే పెయింటింగ్‌ చేయించుకుంటూ...

రెహానా ఫాతిమాకు బెయిలు తిరస్కృతి

న్యూఢిల్లీ, ఆగస్టు 7: వివాదాస్పద ఉద్యమకారిణి రెహానా ఫాతిమా ముందస్తు బెయిలు కోసం దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. అర్ధ నగ్నంగా ఉన్న తన శరీరంపై తన పిల్లలచేతనే పెయింటింగ్‌ చేయించుకుంటూ స్వయంగా రెహానాయే వీడియో చిత్రీకరించి, తర్వాత సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేసింది. దీనికి సంబంధించి ఆమెపై కేసులు దాఖలయ్యాయి. విచారణకు వచ్చిన ఈ ఘటన విని తాము నివ్వెరపోయామని ధర్మాసనం వ్యాఖ్యానించింది. 

Updated Date - 2020-08-08T07:46:07+05:30 IST