Bahrain: వలసదారులకు బహ్రెయిన్ ఆరోగ్యశాఖ తీపి కబురు.. ఇకపై..

ABN , First Publish Date - 2022-09-21T16:52:25+05:30 IST

గల్ఫ్ దేశం బహ్రెయిన్ (Bahrain) వలసదారులకు తీపి కబురు చెప్పింది.

Bahrain: వలసదారులకు బహ్రెయిన్ ఆరోగ్యశాఖ తీపి కబురు.. ఇకపై..

మనామా: గల్ఫ్ దేశం బహ్రెయిన్ (Bahrain) వలసదారులకు తీపి కబురు చెప్పింది. ఇకపై ప్రవాసులకు (Expats) మెరుగైన వైద్యసేవల కోసం ఇ-సర్వీసులను (eService) ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆరోగ్యశాఖకు చెందిన మెడికల్ కమిషన్ చీఫ్ డా. అయేషా అహ్మద్ హుస్సేన్ (Dr. Aisha Ahmed Hussein) తాజాగా కీలక ప్రకటన చేశారు. వలస కార్మికులకు మెరుగైన వైద్యసేవల కోసం ఇ-సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు తన ప్రకటనలో పేర్కొన్నారు. నేషనల్ పోర్టల్ ద్వారా ప్రవాసులు వైద్య పరీక్షల కోసం ఆన్‌లైన్‌‌లో స్లాట్ బుక్ చేసుకోవచ్చని తెలిపారు. 


దీని ద్వారా ప్రవాసుల సమగ్ర ఆరోగ్య డేటా రికార్డు చేసే వీలు కలుగుతుందన్నారు. ఇక ఆన్‌లైన్‌లోనే డాక్టర్ అపాయింట్‌మెంట్, ఫిట్‌నెస్ టెస్ట్‌ల కోసం అపాయింట్ పొందవచ్చని చెప్పారు. అలాగే హెల్త్, ఫిట్‌నెస్ సర్టిఫికేట్లను సైతం ప్రింట్ తీసుకోవచ్చని తెలిపారు. దీంతో పాటు మనకు కావాల్సిన ఆస్పత్రిని (Hospital) ఎంచుకుని వైద్య సేవలు పొందవచ్చన్నారు. ఇన్ఫర్మేషన్ అండ్ ఈ-గవర్నమెంట్ అథారిటీ (iGA), లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (LMRA), నేషనల్ అథారిటీ ఫర్ రెగ్యులేటింగ్ హెల్త్ ప్రొఫెషన్స్ అండ్ సర్వీసెస్ సమన్వయంతో ఆరోగ్యమంత్రిత్వశాఖ (Health Ministry) ఇ-సేవలను అందిస్తుందని డా. అయేషా అహ్మద్ హుస్సేన్ వెల్లడించారు.  


Updated Date - 2022-09-21T16:52:25+05:30 IST