Advertisement
Advertisement
Abn logo
Advertisement

బాలిక ప్రాణాలు కాపాడిన జడ పిన్ను... పారిపోయిన కిడ్నాపర్లు!

బహరాయిచ్: ఉత్తరప్రదేశ్‌లోని బహరాయిచ్‌కు చెందిన ఒక బాలికను ఆమె జడపిన్ను కాపాడింది. స్కూలుకు వెళుతున్న ఆమెను కిడ్నాప్‌చేసే ప్రయత్నం జరిగింది. అయితే ఆ బాలిక అత్యంత చాకచక్యంగా కిడ్నాపర్ల నుంచి తప్పించుకుంది. వివరాల్లోకి వెళితే బహరాయిచ్‌లో నాల్గవ తరగతి చదువుతున్న విద్యార్థిని స్థానిక ప్రభుత్వ పాఠశాలలో నాల్గవ తరగతి చదువుతోంది. 

రోజూ మాదిరిగానే 7:35 గంటలకు పాఠశాలకు వెళ్తుండగా గుర్తు తెలియని ఒక వ్యక్తి  ఆ బాలికను కడ్నాప్ చేసే ఉద్దేశంతో పట్టుకున్నాడు. విషయాన్ని గ్రహించిన ఆ బాలిక తన తలలో నుంచి జడపిన్ను తీసి, ఆ వ్యక్తి చేతిపై గట్టిగా గుచ్చి గాయం చేసి, కేకలు వేసింది. దీంతో ఆ గుర్తు తెలియని వ్యక్తి బాలికను అక్కడే వదిలేసి పారిపోయాడు. ఈ ఘటనపై పాఠశాల హెడ్ నీలమ్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement