బీజేపీ, టీఆర్‌ఎ్‌స్‌ నేతల బాహాబాహి

ABN , First Publish Date - 2021-07-27T06:25:38+05:30 IST

రేషన్‌ కార్డుల పంపిణీని అడ్డు కోవాలని ప్రయత్నించిన బీజేపీ నాయ కులను

బీజేపీ, టీఆర్‌ఎ్‌స్‌ నేతల బాహాబాహి
కడ్తాలలో తోపులాడుకుంటున్న బీజేపీ, టీఆర్‌ఎస్‌ నాయకులు

  • కడ్తాలలో ఇరువర్గాల తోపులాటతో ఉద్రిక్తత 
  • ఎమ్మెల్యేను అడ్డుకోవాలని ప్రయత్నించిన బీజేపీ నేతలు 
  • బీజేపీ నేతలను తోసివేసిన టీఆర్‌ఎస్‌ నాయకులు 


కడ్తాల్‌ : రేషన్‌ కార్డుల పంపిణీని అడ్డు కోవాలని ప్రయత్నించిన బీజేపీ నాయ కులను టీఆర్‌ఎస్‌ నేతలు అడ్డుకోవడంతో ఇరువర్గాలు బాహాబాహికి దిగాయి. పర స్పరం ఒకరినొకరు నెట్టుకొంటూ ఘర్షణకు దిగారు. ఆయా పార్టీల నేతల దూష ణలు, అనుకూల, వ్యతిరేక నినాదాలతో కడ్తాల జాతీయ రహదారిపై ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి టీఆర్‌ఎస్‌ నాయకుల ర్యాలీని అక్కడి నుంచి పంపించి, బీజేపీ నాయకులను అదుపులోకి తీసుకోవడంతో పరిస్థితి సద్దు మణిగింది. వివరాల్లోకి వెళ్తే.. అర్హులందరికీ ఆహార భద్రత కార్డులు ఇవ్వాలని సోమవారం బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఫ్లకార్డులతో రోడ్డుపైకి వచ్చారు. అదేసమయంలో రేషన్‌కార్డుల పంపిణీకి వచ్చిన ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌కు బీజేపీ నాయకులు వినతిపత్రం ఇవ్వడానికి వెళ్తుండగా టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో బీజేపీ శ్రేణులు టీఆర్‌ఎస్‌, కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇరువర్గాల మధ్య తీవ్ర తోపులాట, మాటల యుద్ధం కొనసాగింది. షాద్‌నగర్‌ ఏసీపీ కుషాల్కర్‌, ఎస్‌ఐలు హరిశంకర్‌గౌడ్‌, వరప్రసాద్‌, సిబ్బంది బీజేపీ నేతలను తాళ్లతో వలయంగా అడ్డుకున్నారు. అనం తరం బీజేపీ నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. పోలీసులు అదుపులో బీజేపీ నాయకులు మన్య నాయక్‌, యాదగిరి, సాయిలాల్‌, దోనాదుల మహేశ్‌, భగీరథ్‌, వినయ్‌, సాయిలు, రవి, మహేశ్‌, కొప్పు కృష్ణ, ప్రేమ్‌ నాయక్‌, బల్వంత్‌రెడ్డి, వెంకటయ్య, సింహాద్రి తదితరులు ఉన్నారు.



Updated Date - 2021-07-27T06:25:38+05:30 IST