వెంటిలేటర్లకు బదులు ‘బ్యాగ్‌ వాల్వ్‌ మాస్క్‌’లు

ABN , First Publish Date - 2020-03-31T08:56:16+05:30 IST

వెంటిలేటర్లకు బదులు ‘బ్యాగ్‌ వాల్వ్‌ మాస్క్‌’ను వినియోగించడంపై దృష్టిసారించాలని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ-హైదరాబాద్‌(ఐఐటీహెచ్‌) డైరెక్టర్‌

వెంటిలేటర్లకు బదులు ‘బ్యాగ్‌ వాల్వ్‌ మాస్క్‌’లు

వాడాలని ఐఐటీహెచ్‌ ప్రొఫెసర్ల సూచన

వెంటిలేటర్ల తయారీకి ఆటోమొబైల్‌ ఉత్పత్తిదారులకు కేంద్రం ఆదేశం

2 నెలల్లో 30 వేల వెంటిలేటర్ల తయారీకి భారత్‌ ఎలకా్ట్రనిక్స్‌ లిమిటెడ్‌కు ఆదేశం

రోజుకు 20 వేల ఎన్‌-95 మాస్కులు తయారు చేయనున్న డీఆర్‌డీవో

హైదరాబాద్‌/న్యూఢిల్లీ, మార్చి 30: వెంటిలేటర్లకు బదులు ‘బ్యాగ్‌ వాల్వ్‌ మాస్క్‌’ను వినియోగించడంపై దృష్టిసారించాలని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ-హైదరాబాద్‌(ఐఐటీహెచ్‌) డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ బీఎస్‌ మూర్తి, ప్రొఫెసర్‌ వి.ఈశ్వరన్‌ ప్రభుత్వానికి సూచించారు. సంప్రదాయ వెంటిలేటర్లతో పోలిస్తే చిన్నగా ఉండి, అత్యవసర సమయాల్లో శ్వాసపీల్చుకోవడానికి ఉపయోగపడే ‘బ్యాగ్‌ వాల్వ్‌ మాస్కు’లను ప్రత్యామ్నాయంగా పరిశీలించాలన్నారు. ఏదైనా ఒక నోడల్‌ సంస్థ ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్‌ను నియమించి బ్యాగ్‌ వాల్వ్‌ మాస్కుల ఉత్పత్తిని రెండు నెలలలోపు ప్రారంభించాలని కోరారు. కొవిడ్‌-19 పేషెంట్ల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వెంటిలేటర్లను తయారుచేయాల్సిందిగా ఆటోమొబైల్‌ ఉత్పత్తిదారులను కేంద్రం కోరింది.


అలాగే.. రెండు నెలల్లోగా 30 వేల వెంటిలేటర్లు తయారుచేయాల్సిందిగా భారత్‌ ఎలకా్ట్రనిక్స్‌ లిమిటెడ్‌ను కోరింది. నెలరోజుల్లోగా 10 వేల వెంటిలేటర్ల తయారీకి నోయిడాలోని అగ్వా హెల్త్‌కేర్‌కు ఆర్డర్‌ ఇచ్చింది. ఏప్రిల్‌ రెండోవారం నాటికి ఆ సంస్థ నుంచి వెంటిలేటర్ల సరఫరా ప్రారంభం కానుంది. ఇక.. మాస్కుల కొరతను అధిగమించేందుకు డీఆర్‌డీవో రోజుకు 20 వేల ఎన్‌-95 మాస్కులను తయారుచేయనున్నట్టు కేంద్రం ప్రకటించింది. ప్రస్తుతం దేశంలో రెండు ఉత్పత్తి సంస్థలు రోజుకు 50 వేల ఎన్‌-95 మాస్కులు ఉత్పత్తి చేస్తున్నాయని.. వచ్చేవారానికి ఈ సంఖ్య రోజుకు లక్షకు పెరుగుతుందని అంచనా వేసింది. 

Updated Date - 2020-03-31T08:56:16+05:30 IST