Abn logo
Sep 24 2021 @ 19:47PM

విదేశీ విద్యార్థులకు షాకిచ్చిన దొంగ.. వీసా పని మీద Delhi వెళ్తుండగా..

మీరట్: వీసా పని మీద ఢిల్లీ వెళ్తున్న ఇద్దరు విదేశీ విద్యార్థులకు ఓ దొంగ షాకిచ్చాడు. తన చేతివాటాన్ని చూపించాడు. దీంతో ఆ విదేశీ విద్యార్థులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించిన ఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. 


సుడాన్ దేశానికి చెందిన అక్రమ్, మహ్మద్ అనే ఇద్దరు వ్యక్తులు.. ఉత్తరప్రదేశ్‌లోని ఓ యూనివర్సిటీలో బీసీఏ చదువుతున్నారు. వారి వీసా గడువు దగ్గర పడుతుండటంతో.. దాన్ని పొడిగించేకునేందుకు కావాల్సిన ప్రక్రియను పూర్తి చేయడానికి సహరాన్పూర్ నుంచి ఢిల్లీకి బస్సులో బయల్దేరారు. ఈ క్రమంలో ఓ దొంగ తన చేతి వాటాన్ని చూపించాడు. విద్యార్థుల బ్యాగ్‌ను కొట్టేసి, ఎంచక్కా పరారయ్యాడు. కొద్ది దూరం వరకూ ప్రయాణించిన ఆ విద్యార్థులు.. బ్యాగ్ పోయిన విషయాన్ని గుర్తించి ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ క్రమంలోనే ఆ విద్యార్థులు షామ్లీ పోలీసులను ఆశ్రయించారు. వీసా పనిపై ఢిల్లీకి వెళ్తుండగా తమ బ్యాగును ఎవరో కొట్టేశారని ఫిర్యాదు చేశారు. అందులో ల్యాప్‌టాప్, మొబైల్, రూ.20వేల వరకు డబ్బులు కూడా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేసి, బ్యాగును వెతికి పెడతామని వారికి హామీ ఇచ్చారు. 



ఇవి కూడా చదవండిImage Caption

తాజా వార్తలుమరిన్ని...