బద్వేలు ఆర్డీఓగా ఆకుల వెంకటరమణ

ABN , First Publish Date - 2022-01-19T04:44:54+05:30 IST

కొత్తగా ఏర్పాటైన బద్వేలు రెవెన్యూ డివిజనల్‌ అఽధికారి గా ఆకుల వెంకట రమణను నియమిస్తూ మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

బద్వేలు ఆర్డీఓగా ఆకుల వెంకటరమణ
ఆకుల వెంకటరమణ ఆర్డీఓ (ఫైల్‌ ఫొటో)

ఉత్తర్వులు జారీ - బాధ్యతలు చేపట్టనున్న వైనం

కడప(కలెక్టరేట్‌) జనవరి 18: కొత్తగా ఏర్పాటైన బద్వేలు రెవెన్యూ డివిజనల్‌ అఽధికారి గా ఆకుల వెంకట రమణను నియమిస్తూ మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జిల్లాకేంద్రానికి సమాచారం అందింది. ఆయన చింతూరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా విధులు నిర్వర్తిస్తూ బద్వేలు ఆర్డీఓగా బదిలీ అయ్యారు. తూర్పు గోదావరి జిల్లాలోని ఎతిపాక రెవెన్యూ డివిజనల్‌ అధికారిగా సమర్థవంతంగా  బాధ్యతలు నిర్వర్తించారు.

కడప జిల్లాలో ఇప్పటికే కడప, రాజంపేట, జమ్మల మడుగు రెవెన్యూ డివిజన్లుండగా నాల్గో రెవెన్యూ డివిజన్‌గా 12 మండలాలతో బద్వేలును ఏర్పాటు చేయడం గమనార్హం. టీడీపీ ప్రభుత్వం రెవెన్యూ డివిజనల్‌ కార్యాలయం ఏర్పాటుపై గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కాగా గత నెలలో జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ బద్వేలు రెవెన్యూ డివిజన్‌ పరిపాలన భవనాలకు శంఖుస్థాపన చేశారు. భవన నిర్మాణాలకు రూ. 6 కోట్లు మంజూరు చేశారు. ప్రస్తుతం ఆర్డీఓ కార్యాలయం  లేనందున తాత్కాలికంగా పరిపాలనా భవనం ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారులు తెలిపారు. నాలుగు రోజుల్లో బద్వేలు రెవెన్యూడివిజనల్‌ అధికారిగా వెంకటరమణ బాధ్యతలు చేపట్టనున్నారు.

Updated Date - 2022-01-19T04:44:54+05:30 IST