దుబ్బాకలో రెండో స్థానానికి బీజేపీ, కాంగ్రెస్‌ పోటీ

ABN , First Publish Date - 2020-10-30T11:26:48+05:30 IST

దుబ్బాక నియోజకవర్గ ఉప ఎన్నికలో బీజేపీ, కాంగ్రెస్‌ రెండో స్థానానికి పోటీ పడుతున్నాయని రాజ్యసభ సభ్యు డు బడుగుల లింగయ్యయాదవ్‌ అన్నారు.

దుబ్బాకలో రెండో స్థానానికి బీజేపీ, కాంగ్రెస్‌ పోటీ

మిర్యాలగూడ, అక్టోబరు 29 : దుబ్బాక నియోజకవర్గ ఉప ఎన్నికలో బీజేపీ, కాంగ్రెస్‌ రెండో స్థానానికి పోటీ పడుతున్నాయని రాజ్యసభ సభ్యు డు బడుగుల లింగయ్యయాదవ్‌ అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. న వంబరు 3న జరగనున్న ఎన్నికలో టీఆర్‌ఎస్‌ పార్టీ ఘన విజయం సాధిస్తుందన్నారు. సీఎం కేసీఆర్‌ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు టీఆర్‌ఎస్‌ అభ్యర్ధి సుజాతను గెలిపిస్తాయని జోస్యం చెప్పారు. ఓటమి తథ్యమని భావించిన బీజేపీ ప్రజల సానుభూతి కోసం డ్రామాలు ఆడుతుండగా, డిపాజిట్‌ కోల్పోతామన్న భయంతో కాంగ్రెస్‌ పార్టీ వణికిపోతోందని విమర్శించారు. ఓడిపోతే టీపీసీసీ పదవి పోతుందని ఉత్తమ్‌ భావిస్తుండగా పీసీసీ పదవి కోసం రేవంత్‌ యత్నిస్తున్నాడన్నారు. వ్యవసాయ భూములకు సంబంధించి నిజాం కాలం నాటి నుంచి ఉన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం ధరణిని ప్రవేశపెట్టిందన్నా రు. నూతన అధ్యాయానికి తెరతీసే విధంగా రూపొందించిన ధరణి వెబ్‌సైట్‌ రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. మ్యుటేషన్‌, రిజిష్ట్రేషన్లలో సమస్యలిక ఉండబోవని అన్నారు. రాష్ట్రంలో పండిన ప్రతి గింజ కొనుగోలుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ చర్యలు తీసుకుంటుందన్నారు. భారీవర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన వారికి ప్రభుత్వం నష్ట పరిహా రం చెల్లిస్తుందని హామీనిచ్చారు. ప్రతిపక్షం ఉందా లేదా అని రాష్ట్ర ప్రజ లు అనుమానం వ్యక్తం చేస్తున్నారన్నారు. టీఆర్‌ఎస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు మినహా ఏ పక్షమూ ప్రజల్లోకి వెళ్లలేదన్నారు. సమావేశంలో మునిసిపల్‌ చైర్మన్‌ తిరునగరు భార్గవ్‌, ఏఎంసీ చైర్మన్‌ చింతరెడ్డి శ్రీనివాసరెడ్డి, నల్లమోతు సిద్ధార్థ, రాంబో శ్రీను, పెద్ది శ్రీను పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-30T11:26:48+05:30 IST