గానుగచింతలో బాదుడేబాదుడు నిరసన
రొంపిచెర్ల, మే 15: ఆకాశాన్నంటుతున్న నిత్యావసర ధరలను తగ్గించాలంటూ టీడీపీ మండల అధ్యక్షుడు ఉయ్యాలరమణ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులతో ప్రదర్శన నిర్వహించారు. బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా ఆదివారం రొంపిచెర్ల మండలంలోని గానుగచింత, కమ్మపల్లె, మద్దిపట్లవారిపల్లెల్లో విద్యుత్‌లైట్లు, గ్యాస్ సిలిండర్‌తో వీధుల్లో ర్యాలీగా వెళ్లి నిరసన వ్యక్తంచేశారు. ఈసందర్భంగా రమణ మాట్లాడుతూ పెట్రోల్, డీజల్, గ్యాస్, వంటనూనె, విద్యుత్‌ఛార్జీలు, ఆస్తి, చెత్తపన్నులతో సామాన్య ప్రజల నడివిరుస్తున్నారంటూ మండిపడ్డారు. పెంచిన ఛార్జీలు తగ్గించక పోతే రానున్న రోజుల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో ఓబులేశ్వర్రెడ్డి, రవినాయుడు, ముద్దుక్రిష్ణ, రాజేశ్వరి, క్రిష్ణమనాయుడు, మల్లికార్జుననాయుడు, కవిత, హయద్బాషా, మొగల్మహమ్మదాలి తదితరులు పాల్గొన్నారు.