భద్రాద్రి: జిల్లాలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. భద్రాచలం ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద పోలీసుల వాహన తనిఖీలు చేపట్టారు. ఒరిస్సా నుండి తొర్రూరుకు కారులో అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టుబడింది. 34 లక్షల రూపాయల విలువ గల 170 కేజీల గంజాయి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఇద్దరని పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.