ముగిసిన బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ టోర్నీ

ABN , First Publish Date - 2022-07-04T05:25:16+05:30 IST

స్వర్ణభారతి ఇండోర్‌ స్టేడియంలో షటిల్‌ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ విశాఖ జిల్లా నిర్వహించిన జిల్లా స్థాయి బ్యాడ్మింటన్‌ టోర్నీ, జిల్లా జట్టు ఎంపిక పోటీలు ఆదివారం ముగిశాయి.

ముగిసిన బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ టోర్నీ
విజేతలతో ఏసీపీ చుక్కా శ్రీనివాసరావు తదితరులు

విశాఖపట్నం(స్పోర్ట్సు), జూలై 3: స్వర్ణభారతి ఇండోర్‌ స్టేడియంలో షటిల్‌ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ విశాఖ జిల్లా నిర్వహించిన జిల్లా స్థాయి బ్యాడ్మింటన్‌ టోర్నీ, జిల్లా జట్టు ఎంపిక పోటీలు ఆదివారం ముగిశాయి. టోర్నీ ముగింపు కార్యక్రమానికి రాష్ట్ర బ్యాడ్మింటన్‌ సంఘం సీఈవో, అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీసు చుక్కా శ్రీనివాసరావు ముఖ్య అతిఽఽథిగా హాజరై విజేతలకు ట్రోఫీలు, ధ్రువపత్రాలు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంఘం ప్రతినిధులు పల్లా శ్రీనివాస్‌, ఉషశ్రీ, డాక్టర్‌ వై.పోలిరెడ్డి, కోచ్‌లు పాల్గొన్నారు. 

విజేతలు:

సింగిల్స్‌...అండర్‌-11 బాలుర విభాగంలో వైఎస్‌ఆర్‌ రిత్విక్‌, బి.విశ్వంత్‌...బాలికల విభాగంలో పి.వేదిక, ఎం.వాగ్దేవి; అండర్‌-13 బాలుర కేటగిరీలో కెరాహుల్‌, బీఎల్‌.హర్షవర్దన్‌....బాలికల విభాగంలో సీహెచ్‌.మోక్షజ్ఞ, ఎం.జశ్వీన్‌; అండర్‌-15 బాలుర విభాగంలో పి.బాల ప్రణయ్‌, ఎం.లక్ష్మీ వైశాఖ్‌...బాలికల కేటగిరీలో వి.వైష్ణవి, వైశాలి బెహరా; అండర్‌-17 బాలుర విభాగంలో ఎన్‌ఏకే.కోమల్‌, ఎం.లక్ష్మీ వైశాఖ్‌...బాలికల విభాగంలో వి.వైష్ణవి, ఎ.హర్షిక; అండర్‌-19 బాలుర విభాగంలో ఎం.నందివర్దన్‌, ఎన్‌ఏకే కోమల్‌...బాలికల కేటగిరీలో కేపీఎల్‌ ప్రజ్ఞ, వి.వైష్ణవి; సీనియర్‌ పురుషుల కేటగిరీలో ఎ.సాయికిరణ్‌, నందివర్దన్‌...మహిళల విభాగంలో కేపీఎస్‌.ప్రజ్ఞ, ఎస్‌ఎస్‌.వెంకట హేమ విన్నర్‌, రన్నరప్‌గా నిలిచారు. 

డబుల్స్‌...అండర్‌-11 బాలుర విభాగంలో టి.భార్గవ్‌-వైఎస్‌ఆర్‌.రిత్విక్‌, ఈ.త్రిబునవ్‌-టి.పుష్పక్‌...బాలికల విభాగంలో అలియా లాల్‌చంద్‌-ఎం.వాగ్దేవి, రాశికుమారి-పి.జోషితా; అండర్‌-13 బాలుర కేటగిరీలో బి.హర్షవర్దన్‌-ఎం.చరణ్‌, కుర్రి సుజన్‌-కె.కార్తీక్‌...బాలికల విభాగంలో ఎం.జస్మీన్‌-పి.వేదిక, పి.జోషిక-బి.రిషిత; అండర్‌-15 బాలుర విభాగంలో పి.బాల ప్రణయ్‌-ఎం.లక్ష్మీ వైశాఖ్‌, కె.రాహుల్‌-జి.సిద్ధార్థ సాహు...బాలికల కేటగిరీలో పి.శ్రీసాయిసుధ-సీహెచ్‌.ప్రియర్షి, సీహెచ్‌.అక్షద-సీహెచ్‌.ప్రణతి; అండర్‌-17 బాలుర విభాగంలో ఆర్‌.పార్దీవ్‌-ఎం.పవన్‌, జి.వేణు-వైశాక్‌....బాలికల విభాగంలో ఎం.నాగ సాహితి-ఎన్‌.ధరిణి, వైశాలి బెహర-తన్మయి బెహర; అండర్‌-19 బాలుర విభాగంలో కె.మణికంఠ-గంది అమరనాఽథ్‌, బి.తరుణ్‌ ఆదిత్య-ఎ.వాసుదేవ్‌...బాలికల విభాగంలో ఎస్‌ఎస్‌.వెంకట హేమ-ఎస్‌.కావ్య, ఎ.ప్రవల్లిక-ఎ.హర్షిక; సీనియర్‌ పురుషుల విభాగంలో బి.రాధాకృష్ణ-బి.ప్రణీత్‌, బి.కిరణ్‌కుమార్‌-జి.సత్య....మహిళల విభాగంలో ఎండీ చాందిని ఆశర్‌-ఎ.హేమ దృతి విన్నర్‌, రన్నరప్‌ స్థానాలను సాధించారు. 


Updated Date - 2022-07-04T05:25:16+05:30 IST