ప్రపంచ జూ. బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షి్‌ప రద్దు

ABN , First Publish Date - 2020-10-23T09:45:43+05:30 IST

కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడిన ప్రపంచ జూనియర్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షి్‌ప-2020

ప్రపంచ జూ. బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షి్‌ప రద్దు

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడిన ప్రపంచ జూనియర్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షి్‌ప-2020 రద్దయింది. న్యూజిలాండ్‌ వేదికగా వచ్చే ఏడాది జనవరిలో టోర్నీ జరగాల్సి ఉంది. కొవిడ్‌తో నెలకొన్న అనిశ్చితి, నిషేధాజ్ఞల వల్ల చాంపియన్‌షి్‌పను నిర్వహించే పరిస్థితి కనిపించడం లేదని ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) తెలిపింది. వాస్తవంగా ఈ ఏడాది సెప్టెంబరు-అక్టోబరులో జరగాల్సిన టోర్నీని కరోనా కారణంగా 2021కి వాయిదా వేశారు. 


Updated Date - 2020-10-23T09:45:43+05:30 IST