బద్దిపోచమ్మ ఆలయంలో భక్తుల రద్దీ

ABN , First Publish Date - 2022-01-19T05:56:58+05:30 IST

అమ్మలగన్న అమ్మ వేములవాడ బద్దిపోచమ్మ అమ్మవారి దేవాలయం మంగళవారం బోనాలు సమర్పించే భక్తులతో రద్దీగా మారింది.

బద్దిపోచమ్మ ఆలయంలో భక్తుల రద్దీ
బోనాలతో బారులుదీరిన భక్తులు

వేములవాడ, జనవరి 18 : అమ్మలగన్న అమ్మ వేములవాడ బద్దిపోచమ్మ అమ్మవారి దేవాలయం మంగళవారం బోనాలు సమర్పించే భక్తులతో రద్దీగా మారింది. మేడారం సమ్మక్క సారక్క జాతర సమీపిస్తున్న సందర్భంగా మేడారం వెళ్లడానికి ముందు రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకున్న భక్తులు ఆనవాయితీ ప్రకారం మంగళవారం బద్దిపోచమ్మ అమ్మవారిని దర్శించుకొని బోనం మొక్కు చెల్లించుకున్నారు.  కొవిడ్‌  విజృంభిస్తున్న నేపథ్యంలో ఆలయ సిబ్బంది భక్తులను థర్మల్‌ గన్‌ ద్వారా శరీర ఉష్ణోగ్రత పరీక్షించిన అనంతరం ఆలయంలోకి అనుమతించారు.  భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ ఏఈవో ప్రతాప నవీన్‌, సూపరింటెండెంట్‌ కాంచనపల్లి నటరాజ్‌ ఏర్పాట్లు చేశారు.  

Updated Date - 2022-01-19T05:56:58+05:30 IST