ఎడ్ల బలప్రదర్శన పోటీల్లో జిల్లాకు ప్రథమ స్థానం

ABN , First Publish Date - 2021-04-17T05:25:19+05:30 IST

మండలంలోని దీబగుంట్ల గ్రామంలో గుమ్మిత మల్లికార్జున స్వామి, వీరభద్రస్వామి తిరుణాల సందర్భంగా నిర్వహించిన రాష్ట్రస్థాయి ఎడ్ల బలప్రదర్శన పోటీల్లో కర్నూలు జిల్లాకు ప్రథమ స్థానం లభించింది.

ఎడ్ల బలప్రదర్శన పోటీల్లో జిల్లాకు ప్రథమ స్థానం

గోస్పాడు, ఏప్రిల్‌ 16: మండలంలోని దీబగుంట్ల గ్రామంలో గుమ్మిత మల్లికార్జున స్వామి, వీరభద్రస్వామి తిరుణాల సందర్భంగా నిర్వహించిన రాష్ట్రస్థాయి ఎడ్ల బలప్రదర్శన పోటీల్లో కర్నూలు జిల్లాకు ప్రథమ స్థానం లభించింది. శుక్రవారం న్యూ క్యాటగిరి విభాగంలో కర్నూలు జిల్లా గుంప్రమాన్‌దిన్నె గ్రామానికి చెందిన కుం దూరి రాంభూపాల్‌రెడ్డి ఎద్దులు ప్రథమ స్థానంలో నిలిచి రూ.35 వేలు గెలుపొందాయి. ద్వితీయ స్థానంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన రంగారెడ్డి జిల్లా నాదర్‌బుల్‌ గ్రామానికి చెందిన ప్రసన్నరెడ్డి ఎద్దులు నిలిచి రూ.25 వేలు గెలుపొందాయి. తృతీయ స్థానంలో కర్నూలు జిల్లా బోయిలకుంట్ల గ్రామానికి చెందిన దండుబోయిన బాలకృష్ణ ఎద్దులు రూ.15 వేలు గెలుపొందాయి. నాలుగో స్థానంలో కర్నూలు జిల్లా పీఆర్‌పల్లె గ్రామానికి చెందిన భాషం శ్రీనివాసులు ఎద్దులు రూ.10వేలు గెలుపొందాయి. విజేతలకు డీసీఎంఎస్‌ చైర్మన్‌ పీపీ నాగిరెడ్డి, నీటి సంఘం అధ్యక్షులు చిన్ననాగిరెడ్డి బహుమతులు అం దజేశారు. రిటైర్డ్‌ వీఆర్వో ఉమామహేశ్వరరావు, మాజీ ఎంపీపీ రాజశేఖర్‌రెడ్డి, జనార్థన్‌రెడ్డి, చిట్టెపు ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2021-04-17T05:25:19+05:30 IST