సీఎం జగనతో రాషా్ట్రనికి అరిష్టం

ABN , First Publish Date - 2022-09-28T05:23:18+05:30 IST

భారతీయ సంస్కృతీ, సంప్రదాయాలు గౌరవించని సీఎం జగన మోహన రెడ్డి రాషా్ట్రనికి పట్టిన అరిష్టమని మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

సీఎం జగనతో రాషా్ట్రనికి అరిష్టం
మాట్లాడుతున్న పల్లె రఘునాథరెడ్డి

తిరుమలలో డిక్లరేషన ఎందుకివ్వలేదు?

మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి


అనంతపురం, సెప్టెంబరు27 (ఆంధ్రజ్యోతి) : భారతీయ సంస్కృతీ, సంప్రదాయాలు గౌరవించని సీఎం జగన మోహన రెడ్డి రాషా్ట్రనికి పట్టిన అరిష్టమని మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తిరుమలలో ఆయన డిక్లరేషన ఇవ్వకపోవడంపై పల్లె స్పందించారు. మంగళవారం అనంతపురంలోని ఆయన తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. దేశంలోనే కాకుండా విదేశీయులు సైతం భారతీయ సంస్కృతిని ఎంతో గొప్పగా గౌరవిస్తున్నారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి మాత్రం హిందూ సంప్రదాయాలపై నమ్మకం లేకపోగా, చిన్నచూపు చూస్తుండటం బాధాకరమన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీనివాసుడి సన్నిధి హిందువులకు పరమపవిత్రమైన క్షేత్రమన్నారు. అక్కడ అన్య మతస్థులు పర్యటించాలంటే ‘తమకు శ్రీనివాసుడిపై అపార నమ్మకం, విశ్వాసం..’ అంటూ ఓ డిక్లరేషన ఇవ్వాల్సి ఉంటుందన్నారు. కానీ సీఎం జగన రెడ్డి ఎలాంటి డిక్లరేషన ఇవ్వకుండా వెళ్లడం ఏమిటని ప్రశ్నించారు. దేవుడికి పట్టువస్ర్తాలు సమర్పించాలంటే సతీసమేతంగా వెళ్లాలన్నారు. సీఎం జగన మాత్రం తిరుమలకు ఎప్పుడు వెళ్లినా ఒంటరిగా పట్టువసా్త్రలు ఇస్తూ హిందూ సంప్రదాయలను కాలరాస్తున్నాడని పల్లె మండిపడ్డారు. సీఎం వైఖరిపై పండితులు, మేధావులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారన్నారు. భక్తులు తమ మనోభావాలు దెబ్బతింటున్నాయని ఆవేదన చెందుతున్నారన్నారు. తిరుమల విషయంలో ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్న తీరు రాష్ర్టానికే అరిష్టమని పండితులు చెబుతున్నారన్నారు. ఇది మహా అపచారమన్నారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలను అవమానించడమేనన్నారు. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ, మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం లాంటి వారే తిరుమల సంప్రదాయాలను గౌరవించి డిక్లరేషన ఇచ్చారన్న విషయాన్ని పల్లె గుర్తు చేశారు. టీటీడీ పవిత్రత దెబ్బతీసేలా 81 మంది సభ్యులను నియమించి టీటీడీ బోర్డును రాజకీయ వ్యాపార కేంద్రంగా మార్చారని ఆయన జగనపై మండిపడ్డారు. తిరుమల పవిత్రతకు భంగం వాటిల్లేలా ప్రవర్తిస్తే భగవంతుడు కూడా క్షమించడని పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. 

Updated Date - 2022-09-28T05:23:18+05:30 IST