చాణక్యనీతి: ఈ అలవాట్లు మనిషిని ముందడుగు వేయనియ్యవు

ABN , First Publish Date - 2022-04-24T12:55:37+05:30 IST

ఒక వ్యక్తి జీవితంలో విజయం సాధించాలంటే...

చాణక్యనీతి: ఈ అలవాట్లు మనిషిని ముందడుగు వేయనియ్యవు

ఒక వ్యక్తి జీవితంలో విజయం సాధించాలంటే చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని చాణక్య నీతి చెబుతోంది. ఆచార్య చాణక్య తెలిపిన ఆ చెడు అలవాట్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

సమయాన్ని వృథా చేయవద్దు 

చాణక్య నీతి ప్రకారం సమయం విలువ తెలియని వ్యక్తి జీవితంలో లక్ష్యాలను సాధించడంలో పలు సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుంది. కాలం ఎవరి కోసం ఆగదని ఆచార్య చాణక్యుడు చెప్పారు. ఒకసారి గడిచిన కాలం తిరిగి రాదు. సరైన సమయానికి తీసుకున్న తగిన నిర్ణయం విజయంలో ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నవారు తమ లక్ష్యాలను సాధించగలుగుతారు.

బద్ధకం అత్యంత బద్ధ శత్రువు

చాణక్య నీతి ప్రకారం సోమరితనం అనేది ఒక వ్యక్తిని విజయం సాధించడానికి అనుమతించని ఒక లోపం. బద్ధకం కలిగిన వ్యక్తి అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోతాడు. అలాంటి వారు ఆ తర్వాత సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.


శ్రమించేందుకు వెనుకాడవద్దు

చాణక్య నీతి ప్రకారం మీరు జీవితంలో విజయం సాధించాలంటే, శ్రమకు భయపడకూడదు. అలాంటి వారికి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభించదు. శ్రమ లేకుండా విజయం సాధ్యం కాదు. 

వ్యసనం విజయానికి ఆటంకం

అన్ని రకాల మత్తు పదార్థాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలని చాణక్య నీతి చెబుతోంది. మత్తు వల్ల ఆరోగ్యంతో పాటు మనసు, మెదడుపై కూడా చెడు ప్రభావం పడుతుంది. మాదకద్రవ్యాలకు బానిసలు ఎప్పుడూ నైపుణ్యంతో పని చేయలేరు. అలాంటి వారిని ఇతర లోపాలు కూడా చుట్టుముడతాయి. డ్రగ్స్‌కు దూరంగా ఉంటేనే జీవితంలో గొప్ప విజయాన్ని సాధించవచ్చు. మాదకద్రవ్యాలకు బానిసలైనవారు తమ ప్రతిభను ఉపయోగించుకోలేరు. వారికి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభించదు. 

Updated Date - 2022-04-24T12:55:37+05:30 IST