సుంకాన్ని తగ్గించేది లేదంటున్న భారత్... ‘టెస్లా’కు ఎదురుదెబ్బ

ABN , First Publish Date - 2021-08-03T22:33:10+05:30 IST

భారత్‌కు దిగుమతయ్యే విద్యుత్తు వాహనాలపై సుంకాన్ని తగ్గించేది లేదని భారత్ స్పష్టం చేయడంతో... టెస్లా సంస్థకు ఎదురుదెబ్బ తగిలింది.

సుంకాన్ని తగ్గించేది లేదంటున్న భారత్... ‘టెస్లా’కు ఎదురుదెబ్బ

న్యూఢిల్లీ : భారత్‌కు దిగుమతయ్యే విద్యుత్తు వాహనాలపై సుంకాన్ని తగ్గించేది లేదని భారత్ స్పష్టం చేయడంతో... టెస్లా సంస్థకు ఎదురుదెబ్బ తగిలింది. అంతేకాదు... అసలు అటువంటి ప్రతిపాదనే పరిశీలనలో లేదని స్పష్టం చేసింది. ఈ క్రమంలో... భారత్‌లో టెస్లా కార్ల ప్రవేశానికి బ్రేక్ పడినట్లయింది. కొద్దిరోజుల క్రితమే టెస్లా అధినేత ఎలన్ మస్క్... భారత్ దిగుమతి సుంకాన్ని తగ్గించే అవకాశాలున్నాయంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ కేంద్రం మాత్రం ఆ దిశగా నిర్ణయం తీసుకోలేదు. టెస్లా విద్యుత్తు కారు ధర భారత కరెన్సీలో దాదాపు రూ. కోటి పైనే ఉంటుంది. వీటిని భారత మార్కెట్‌లోకి తీసుకురావాలంటే 60-100 శాతం మేర  దిగుమతి సుంకాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఓవూపు... కారు ధర భారీగా ఉండగా, సుంకంతో కలిపుకుంటే... మరింత భారీగా ఉంటుంది. ఈ నేపధ్యంలో... టెస్లా విద్యుత్తు కారును భారత్‌లోకి తీసుకొచ్చినా ఎక్కువమందికి చేరువ కాలేమని టెస్లా భావిస్తోంది. 


Updated Date - 2021-08-03T22:33:10+05:30 IST