బ్యాక్‌లాగ్‌ పోస్టులు జనరల్‌కా?

ABN , First Publish Date - 2022-06-26T07:30:34+05:30 IST

బ్యాక్‌లాగ్‌ పోస్టులు జనరల్‌కా?

బ్యాక్‌లాగ్‌ పోస్టులు జనరల్‌కా?

ఎస్సీ, ఎస్టీలకే కేటాయించాలని శ్రావణ్‌కుమార్‌ డిమాండ్‌

విజయవాడ, జూన్‌ 25: ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్‌ పోస్టులను జనరల్‌ కేటగిరీలో భర్తీ చేసేందుకు వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇవ్వడాన్ని జైభీమ్‌ భారత్‌ పార్టీ వ్యవస్థాపకుడు జడ శ్రావణ్‌కుమార్‌ ఖండించారు. ఈ జీవోను హైకోర్టులో సవాల్‌ చేస్తామన్నారు. విజయవాడలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్‌ పోస్టులను ఆయా వర్గాల వారితోనే భర్తీ చేయాలని డిమాం డ్‌ చేశారు. రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్లు ఎలా అమలుచేయాలో కూడా ఈ ప్రభుత్వానికి తెలియడం లేదని విమర్శించారు.

Updated Date - 2022-06-26T07:30:34+05:30 IST