చెన్నై నుంచి వెనక్కి..

ABN , First Publish Date - 2020-03-29T10:00:49+05:30 IST

కరోనా వైరస్‌ ప్రభావంతో అరటి రైతులు భారీగా నష్టపోతున్నారు.

చెన్నై నుంచి వెనక్కి..

నంద్యాల టౌన్‌, మార్చి 28: కరోనా వైరస్‌ ప్రభావంతో అరటి రైతులు భారీగా నష్టపోతున్నారు. దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌తో అరటి పంటను అమ్ముకోలేక పోతున్నారు. మహానంది మండలం ఎం.తిమ్మాపురానికి చె ందిన తోట ప్రసాదు రెండు రోజుల క్రితం 500 అరటి గెలలు లారీలో చెన్నైకి పంపించారు.


అయితే అక్కడి వ్యాపారులు గెలలను మార్కెట్‌లో దించుకోక పోవడంతో లారీ తిరిగి నంద్యాల మార్కెట్‌కు వచ్చింది. లారీలో మూడు రోజులు ఉండడంతో చాలా గెలలు కుళ్లిపోయాయి. దీంతో రూ.1.2 లక్షల నష్టం జరిగిందని ఆ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పటికే కోతకు వచ్చిన అరటి దెబ్బతింటోందని, వేసవి కావటంతో అరటి మొక్కలు నేల కూలుతున్నాయని వాపోతున్నాడు. 

Updated Date - 2020-03-29T10:00:49+05:30 IST