వెన్ను అవకరాల జననాలు నివారణ సాధ్యమే

ABN , First Publish Date - 2022-08-11T06:35:33+05:30 IST

పుట్టుకతో వచ్చే వెన్ను అవకరాలు నివారణ సాధ్యమేనని అమెరికాకు చెందిన పీడియా ట్రిక్‌ న్యూరో సర్జన్‌, బిరిమింగామ్‌ చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌ చైర్మన్‌ డాక్టర్‌ జెఫ్రీ బ్లౌంట్‌ పేర్కొన్నారు. పుట్టుకతోనే వచ్చే వెన్ను అవ కరాలపై అవగాహన కల్పించేందుకు బీచ్‌ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్‌ హాల్‌లో బుధవారం నిర్వహించిన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ అనేక దేశాల్లో కొన్నేళ్ల కిందట ఇది పెద్ద సమస్యగా పరిణమించిందన్నారు.

వెన్ను అవకరాల జననాలు నివారణ సాధ్యమే
సదస్సులో పాల్గొన్న వివిధ ప్రాంతాల వైద్యులు

విశాఖపట్నం, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): పుట్టుకతో వచ్చే వెన్ను అవకరాలు నివారణ సాధ్యమేనని అమెరికాకు చెందిన పీడియా ట్రిక్‌ న్యూరో సర్జన్‌, బిరిమింగామ్‌ చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌ చైర్మన్‌ డాక్టర్‌ జెఫ్రీ బ్లౌంట్‌ పేర్కొన్నారు. పుట్టుకతోనే వచ్చే వెన్ను అవ కరాలపై అవగాహన కల్పించేందుకు బీచ్‌ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్‌ హాల్‌లో బుధవారం నిర్వహించిన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ అనేక దేశాల్లో కొన్నేళ్ల కిందట ఇది పెద్ద సమస్యగా పరిణమించిందన్నారు. పోలిక్‌ యాసిడ్‌ను తగినంతగా అందించడం వల్ల సమస్యకు పరిష్కారం లభిస్తుందని నిర్ధారణ అయిందన్నారు. భారత్‌లోనూ ఆ దిశగా వైద్యుల బృందం ప్రయత్ని స్తున్నట్టు పేర్కొన్నారు. అమెరికాకు చెందిన పీడియా ట్రిక్‌ న్యూరో సర్జన్‌ డాక్టర్‌ జోగి వి పట్టిశాపు మాట్లాడు తూ వెన్ను అవకరాల సంభవించే జననాలను తగ్గించేం దుకు ప్రయత్నిస్తున్నామని, ఏజెన్సీ ప్రాంతంలో పరిశోధన ప్రారంభించామన్నారు. పరిశోధనలో భాగం గా ఉప్పులో పోలిక్‌ యాసిడ్‌ను కలిపి అందిస్తున్నామని వివరించారు. లయన్‌ రమేష్‌ స్పినా బిఫిడా బారిన పడ డానికి గల కారణాలు, నివారణమార్గాలను వివరిం చారు. డాక్టర్‌ ఎం.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ స్పినా బిఫిడాపై అవగాహన కలిగించేందుకు ఐదు వేల మం ది రోటరీ క్లబ్‌ సభ్యులను వినియోగిస్తామన్నారు. కేజీ హెచ్‌ న్యూరో సర్జరీ విభాగం ప్రొఫెసర్‌ డాక్టర్‌ హయగ్రీవరావు మాట్లాడుతూ స్పినా బిఫిడా నివా రించదగినదన్నారు. భారత్‌ నుంచి దీనిని పూర్తిగా తొల గించేందుకు కృషిచేస్తామన్నారు. కార్యక్రమంలో ఆంధ్ర మెడికల్‌ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ జి.బుచ్చిరాజు, ఆంధ్ర యూనివర్సిటీ ఫార్మాస్యూటికల్‌ సైన్సెస్‌ ప్రిన్సిపా ల్‌ ప్రొఫెసర్‌ వై.రాజేంద్రప్రసాద్‌, రోటరీ జిల్లా గవర్నర్‌, పీడియాట్రీషియన్‌ డాక్టర్‌ ఎం.వెంకటేశ్వరరావు, రంగరా య మెడికల్‌ కళాశాల న్యూరో సర్జరీ విభాగాధిపతి డాక్టర్‌ ఎంవీ విజయ్‌శేఖర్‌, ఆంధ్రా మెడికల్‌ కళాశాల కమ్యూనిటీ మెడిసిన్‌ విభాగా నికి చెందిన డాక్టర్‌ కేవీ ఫణి మహదేవి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-11T06:35:33+05:30 IST