తెలంగాణ పోలీసు వ్యవస్థ దేశానికే ఆదర్శం: సీపీ సజ్జనార్‌

ABN , First Publish Date - 2021-04-11T06:03:36+05:30 IST

తెలంంగాణ పోలీసు వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ అన్నారు. బాచుపల్లిలోని ఊరగుట్టపై ఉన్న రెండు

తెలంగాణ పోలీసు వ్యవస్థ దేశానికే ఆదర్శం: సీపీ సజ్జనార్‌
భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న సజ్జనార్‌, వివేకానంద్‌, శంభీపూర్‌ రాజు

నిజాంపేట్‌, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): తెలంంగాణ పోలీసు వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ అన్నారు. బాచుపల్లిలోని ఊరగుట్టపై ఉన్న రెండు ఎకరాల స్థలంలో కార్పొరేషన్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ నిధుల కింద అరబిందో ఫార్మా సంస్థ సహకారంతో రూ.3.13కోట్లతో నిర్మించనున్న బాచుప ల్లి పోలీ్‌సష్టేషన్‌ భవన నిర్మాణానికి ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు, ఎమ్మెల్యే వివేకానంద్‌, అరబిందో ఫార్మా వైస్‌ చైర్మన్‌ నిత్యానందరెడ్డితో కలిసి సీపీ శనివారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఆ స్థలం చుట్టూ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో నిజాంపేట మేయర్‌ నీలా గోపాల్‌రెడ్డి, కమి్‌షనర్‌ గోపి, కార్పొరేటర్లు పోలీసులు తదితరులు పాల్గొన్నారు.




Updated Date - 2021-04-11T06:03:36+05:30 IST