CIFNETలో ప్రోగ్రామ్‌లు

ABN , First Publish Date - 2022-05-12T20:47:36+05:30 IST

కేంద్ర ఫిషరీస్‌ విభాగం ఆధ్వర్యంలోని సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫిషరీస్‌ నాటికల్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ ట్రెయినింగ్‌ (సీఐఎఫ్‌ఎన్‌ఈటీ) - బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిషరీ సైన్స్‌(Bachelor of Fisheries Science) (బీఎఫ్‌ఎస్సీ) నాటికల్‌ సైన్స్‌, వెసల్‌ నావిగేటర్‌ కోర్సు (వీఎన్‌సీ)/ మెరైన్‌ ఫిట్టర్‌..

CIFNETలో ప్రోగ్రామ్‌లు

కేంద్ర ఫిషరీస్‌ విభాగం ఆధ్వర్యంలోని సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫిషరీస్‌ నాటికల్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ ట్రెయినింగ్‌ (సీఐఎఫ్‌ఎన్‌ఈటీ) -  బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిషరీ సైన్స్‌(Bachelor of Fisheries Science) (బీఎఫ్‌ఎస్సీ) నాటికల్‌ సైన్స్‌, వెసల్‌ నావిగేటర్‌ కోర్సు (వీఎన్‌సీ)/ మెరైన్‌ ఫిట్టర్‌ కోర్సు(Marine Fitter Course) (ఎంఎఫ్‌సీ)లలో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.  


బీఎఫ్‌ఎస్సీ(నాటికల్‌ సైన్స్‌)

ప్రోగ్రామ్‌ వ్యవధి నాలుగేళ్లు. ఇందులో ఎనిమిది సెమిస్టర్లు ఉంటాయి. సముద్రంలో ప్రయాణించే ఫిషింగ్‌ వెసల్స్‌పై ఇంటిగ్రేటెడ్‌ ప్రాక్టికల్‌ అండ్‌ ఆన్‌బోర్డ్‌ ట్రెయినింగ్‌ ఉంటుంది. ఈ ప్రోగ్రామ్‌నకు కొచ్చిలోని సీయూఎస్‌ఏటీ, యూజీసీ, ముంబైలోని డీజీ షిప్పింగ్‌ గుర్తింపు ఉంది. ఈ ప్రోగ్రామ్‌ కొచ్చి క్యాంప్‌సలో అందుబాటులో ఉంది. మొత్తం 45 సీట్లు ఉన్నాయి. ఇందులోనే లేటరల్‌ ఎంట్రీకి 5 సీట్లు ప్రత్యేకించారు.  కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. విశాఖపట్నం సహా చెన్నై, కొచ్చి కేంద్రాల్లో ఎగ్జామ్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తారు.  

అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి  ఎంపీసీ/ బైపీసీ గ్రూప్‌తో ఇంటర్‌/ పన్నెండోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. కనీసం 50 శాతం మార్కులు తప్పనిసరి. అభ్యర్థుల వయసు అక్టోబరు 1 నాటికి 17 నుంచి 20 ఏళ్ల మధ్య ఉండాలి. లేటరల్‌ ఎంట్రీ అభ్యర్థులకు 22 ఏళ్లు మించకూడదు. 

దరఖాస్తు ఫీజు: జనరల్‌, ఓబీసీ అభ్యర్థులకు రూ.500; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.250

కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ తేదీ: జూలై 2


వీఎన్‌సీ/ ఎంఎఫ్‌సీ

ఇవి ట్రేడ్‌ కోర్సులు. ఒక్కో కోర్సు వ్యవధి రెండేళ్లు. వీటిలో ఫిషింగ్‌ వెసల్స్‌పై ప్రాక్టికల్‌ ట్రెయినింగ్‌ ఉంటుంది. ఎన్‌సీవీటీ క్రాఫ్ట్స్‌మెన్‌ ట్రెయినింగ్‌ స్కీం కింద న్యూఢిల్లీలోని డీజీఈటీ, ఈ కోర్సులను నిర్వహిస్తోంది. ఈ కోర్సులు కొచ్చి, చెన్నై, విశాఖపట్నం క్యాంప్‌సలలో అందుబాటులో ఉన్నాయి. వీఎన్‌సీలో 20, ఎంఎఫ్‌సీలో 20 సీట్లు ఉన్నాయి. కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.1500ల స్టయిపెండ్‌ ఇస్తారు. పోస్ట్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ట్రెయినింగ్‌ సమయంలో నెలకు రూ.20,500ల స్టయిపెండ్‌ ఇస్తారు. యూనిఫాం అలవెన్స్‌ కింద రూ.2500 చెల్లిస్తారు.


అర్హత: మేథమెటిక్స్‌, సైన్స్‌ ప్రధాన సబ్జెక్టులుగా పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. కనీసం 40 శాతం మార్కులు తప్పనిసరి. అభ్యర్థుల వయసు ఆగస్టు 1 నాటికి 15 నుంచి 20 ఏళ్ల మధ్య ఉండాలి. 

దరఖాస్తు ఫీజు: జనరల్‌, ఓబీసీ అభ్యర్థులకు రూ.300; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.150

కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ సెంటర్లు: కొచ్చి, చెన్నై, విశాఖపట్నం, కోల్‌కతా, పట్నా

కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ తేదీ: జూలై 16న


ముఖ్యసమాచారం

దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: జూన్‌ 20 

వెబ్‌సైట్‌ నుంచి దరఖాస్తు ఫారాన్ని డౌన్‌లోడ్‌ చేసుకొని నింపి నిర్దేశిత పత్రాలు జతచేసి కింది చిరునామాకు పంపాలి. 

దరఖాస్తుకు జతచేయాల్సిన పత్రాలు: పదోతరగతి, ఇంటర్‌ / పన్నెండో తరగతి మార్కుల పత్రాలు; కుల ధృవీకరణ పత్రాలు, ఫీజుకు సంబంధించిన ఈ రిసిప్ట్‌

చిరునామా: ద డైరెక్టర్‌, సీఐఎఫ్‌ఎన్‌ఈటీ, ఫైన్‌ ఆర్ట్స్‌ ఎవెన్యూ, కొచ్చి - 682016

వెబ్‌సైట్‌: www.cif net. gov.in

Read more